Sunday, February 23, 2025

లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : 2023/-24 సంత్సరానికి గాను లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని లయన్స్ భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ నూతన అధ్యక్షులుగా తల్లపురెడ్డి కృష్ణారెడ్డి, కార్యదర్శిగా వేముల హన్మంతరావు, కోశాధికారిగా గుడిపూడి జనార్దన్‌రావులు కొత్త కార్యవర్గంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా పాస్ట్ జిల్లా గవర్నర్ యానాల మోహనరెడ్డి, వైస్ జిల్లా గవర్నర్- 2 నంబూరి మధుసూధన్‌రావులు హాజరై వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం హైదరాబాద్ నుండి ముఖ్యఅతిధిగా వచ్చిన పాస్ట్ జిల్లా గవర్నర్ యానాల మోహనరెడ్డి మాట్లాడుతూ సమాజంలో లయన్స్‌క్లబ్ సేవలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సేవా కార్యక్రమాలు మారుమూల ప్రాంతాలకు అందినపుడే సేవాతత్పరతకు సార్దకత చేకూరుతుందన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గం ఈ ఏడాది విసృతంగా కార్యక్రమాలు చేపట్టి అన్ని క్లబ్‌లకు మార్గదర్శకంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం క్లబ్ తరుపున ఐదుగురు ప్రముఖ డాక్టర్లను, సిఎ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ బాధ్యులు డాక్టర్ ఎ.రాఘవరెడ్డి, మోతుకూరి మురళీధర్‌రావు, లగడపాటి ప్రభాకర్‌రావు, కమర్తపు కిరణ్‌కుమార్, బసవ పున్నయ్య, జోన్ చైర్మన్ పాయల నాగేశ్వరరావు, డాక్టర్ డిపిసి రావు, కల్వకుంట్ల గోపాలరావు, ఎం.రవికుమార్, క్రిష్ణమూర్తి, కొంకిమళ్ల విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News