Monday, December 23, 2024

లయన్స్ సేవా తరుణి సేవలు అభినందనీయం

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని లయన్స్ క్లబ్ గవర్నర్ కన్నా పరశురాములు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి అధ్యక్షురాలు వజినపల్లి దీప ఆధ్వర్యంలో శనివారం అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పరశురాములు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమైందన్నారు. సమాజంలోని అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సామాజిక సేవలో కూడా తమవంతు భూమికను పోషిస్తున్నారని చెప్పడానికి లయన్స్ క్లబ్ సేవా తరుణి వారు చేపట్టిన సేవా కార్యక్రమాలే నిదర్శనంగా నిలిచాయన్నారు.

ఏడాది కాలంలో సుమారు 120కి పైగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది అవసరార్థులకు అండగా నిలిచారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రధాన క్లబ్‌లతో పోటీపడి సేవా ఒరవడి కొనసాగించారన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లందరికి సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ రేవూరి వెంకన్న, జిల్లా బాధ్యులు ప్రతాపని వెంకటేశ్వర్లు, రీజియన్ కార్యదర్శి దామెర సరేశ్, క్లబ్ ప్రధాన కార్యదర్శి వజినపల్లి శైలజ, కోశాధికారి చీదర నీలిమ, పూర్వ అధ్యక్షులు డాక్టర్ వి.శారద, డాక్టర్ ఎస్.నాగవాణి, రేవూరి శ్రీదేవి, శ్రీదేవిరెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News