Thursday, January 23, 2025

ప్రపంచంలోనే తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ భారత్‌లో

- Advertisement -
- Advertisement -

ఖగోళ అధ్యయనాల కోసం ఉత్తరాఖండ్ అబ్జర్వేటరీలో ఏర్పాటు

Liquid mirror telescope made by India

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఉత్తరాఖండ్ లోని దేవస్థల్ అబ్జర్వేటరీలో ఏర్పాటైంది. ప్రపంచం లోనే ఖగోళ అధ్యయనాల కోసం ఏర్పాటైన మొదటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఇదే. అంతేకాకుండా ఆసియాలో అతి పెద్ద అంతర్జాతీయ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఇది. దీనిని ఆర్యభట్ట రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ కు చెందిన దేవస్థల్ అబ్జర్వేటరీ క్యాంపస్‌లో 2450 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు.

ప్రపంచపు అంచున గల ఖగోళ అంశాలు , గెలాక్సీలను పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్‌ను ఉపయోగిస్తారు. సంప్రదాయ టెలిస్కోప్ ల్లో వక్రతల ఉపరితలం గల ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పాలిష్ట గ్లాస్ మిర్రర్స్ ఉంటాయి. నిర్దిష్ట రాత్రివేళల్లో ప్రత్యేక ఖగోళ అంశాలను పరిశీలించేందుకు వీటిని వాడతారు. అయితే లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపులు రిఫ్లెక్టివ్ లిక్విడ్స్‌తో తయారవుతాయి. దేవస్థల్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ లో మెర్కురీ వాడతారు. ఇది నక్షత్రాలు, గెలాక్సీలు, సోపర్ నోవా పేలుళ్లు, ఆస్టరాయిడ్స్, స్పేస్ డెబ్రిస్ వంటి వాటిని పరిశీలించడానికి ఉపయోగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News