Friday, November 15, 2024

ఇంటికే చుక్క.. విందుకు ముక్క!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ కార్యం జరుపుకోవాలన్న నగదు చేతిలోకి తీసుకోవడమే కష్టంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో నగదుతో వేడు క చేయడం కూడా కష్టసాథ్యమే అవుతున్న సందర్భంలో శుభకార్యంలో ముక్కా, చుక్కా ను ఏర్పాటు చేయడం కత్తిమీద సవాలైంది. ఈ పరిస్థితుల్లో ఖైరతాబాద్‌లోని ఓ కుటుంబం ఆహ్వానంతో పాటు వారికి ఇష్టమైన బ్రాండ్ మందును అందించి వేడుకకు వచ్చి ఆశీర్వదించి, ముక్కలతో భోంచేసి పోవాలని విన్నవించింది.

శుభ కార్యాన్ని వాయిదా వేస్తామా? ఎలాగైనా ఆత్మీయు లను ఆహ్వానించి మంచి పండుగ చేసుకోవాల్సిందే. పండుగ అంటే చుక్క, ముక్క గ్యారంటీగా ఉండాల్సిందే. ముక్క అంటే వండేయగలం కానీ, చుక్కతోనే అసలు చిక్కు వచ్చి పడింది. మందు బాటిళ్లు ఒక దగ్గరకు తెచ్చుకుని పుచ్చుకుంటే పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తున్నారా? అనే అపప్రద, అభద్రత తప్పదు. అందుకే ఆ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. తమ బంధువులకు ఏ లోటు రానీయవద్దు అని అనుకుంది. అలాగే శుభకార్యం శుభప్రదంగా జరిగిపోవాల్సిందేనని సంకల్పించింది. ఖైరతాబాద్‌కు చెందిన ఓ కుటుంబం శుభకార్యం కోసం అన్ని సిద్ధం చేసుకున్నా ఎన్నికల కోడ్‌తో సెలబ్రేషన్‌లో కొత్త ట్విస్ట్ పట్టుకు వచ్చింది.

తమ బంధువులు, ఆత్మీయులకు పండుగ కోసం ఆహ్వానిస్తూనే ఇన్విటేషన్ కార్డుతోపాటు మందు బాటిల్ కూడా పంపించేసింది. అదీ ఇదీ అని కాదు సదరు వ్యక్తికి ఇష్టమైన బ్రాండ్‌ను అందించింది. ఎన్నికల కోడ్ కాబట్టి ఆ లిక్కర్‌ను వారి ఇంటి వద్దే పుచ్చుకుని మెల్లిగా సెలెబ్రేషన్‌కు అటెండ్ అయితే చాలు. శుభకార్యం నిర్వహిస్తున్న వేదిక వద్ద ఎలాగూ ముక్కలతో విందు చేసుకోవచ్చు.

ఈ ఇన్విటేషన్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. ఎన్నికల కోడ్‌లోనూ బంధువులకు చుక్కా, ముక్కా లోటు రాకుండా వినూత్నంగా ఆ కుటుంబం ఆలోచించిందని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం క్యాంపెయిన్ పీక్ స్టేజ్‌లో ఉన్న తరుణం లోనూ తమ వేడుకకు రాజకీయ వాసనలు అంటుకోకుండా సదరు కుటుంబం జాగ్రత్త వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News