Monday, January 20, 2025

తిరుమలలో మద్యం కలకలం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుమలలో మరోసారి మద్యం కలకలం రేగింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మరోసారి అపచారం చోటు చేసుకుంది. తాజాగా తిరుమలలో మరోసారి మద్యం బాటిల్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి సమీపంలోని హెచ్‌టీ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 78లో 5 మద్యం బాటిల్స్ పట్టుబడ్డాయి. దుకాణదారుడు తన స్నేహితులతో సంబరాలు చేసుకుంటుండగా టిటిడి అధికారులు సోదాలు నిర్వహించడంతో మద్యం బాటిల్స్ పట్టుబడ్డాయి. దీంతో అధికారులు షాప్‌ను సీజ్ చేసి దు కాణదారుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక, తిరుమలలో మద్యం బా టిల్స్, గంజాయి పట్టుబడుతుండటంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి అక్రమాలకు అడ్డుకడ్డ వేయాలని కోరుతున్నారు. తిరుమల కొండపైకి మద్యం, గంజాయి తరిలిస్తుంటే విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తి రుమల పవిత్రను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేస్తున్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు. ఇక, తిరుమల హిం దువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షే త్రం. ఇక్కడ మ ద్యం, మాంసాహారం తిన డం, పొగాకు నమల డం, సిగరెట్లు తాగ డం వంటి వా టిపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News