Monday, December 23, 2024

రూ. కోటీ 83 లక్షల మద్యం బాటిళ్ల ధ్వంసం

- Advertisement -
- Advertisement -

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న మద్యం బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. గోవా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ట్యాక్స్ చెల్లించని 686 కేసుల మద్యాన్ని( పుల్ బాటిల్స్) అధికారులు హైదరాబాద్ లో పట్టుకున్నారు. అనంతరం వాటిని ధ్వంసం చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ సమక్షంలో వివిధ స్టేషన్లలో పట్టుకున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 10 వేల 222 లీటర్ల మద్యాన్ని శనివారం అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. అన్నింటిని రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేయించారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ.1.83 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ పరిధిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌గా పట్టుబడిన మద్యం బాటిళ్లను శనివారం డిప్యూటి కమిషనర్ ధశరధ్, ఇతర అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు.

వివరాల్లోకి వెళితే రంగారెడ్డి డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ పరిధిలో గోవా,హర్యానా, ఢిల్లీతో సహ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్సైజ్ పన్నులు చెల్లించకుండా తెలంగాణకు బస్సుల్లో, విమానాల్లో, వాహనాల్లో తీసుకవచ్చిన సమయంలో పట్టుబడిన మద్యం పుల్ బాటిళ్లను చాల కాలంగా పోలీస్ స్టేషన్లలో నిల్వ చేశారు. ఈ మద్యం బాటిళ్లను ఉన్నతాధికారులు అనుమతితో రంగారెడ్డి డిప్యూటి కమిషనర్ దాశరథ్ ఇతర ఎక్సైజ్ అధికారుల సమక్షంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ పరిధిలో ఈ మద్యాన్ని ధ్వంసం చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో 686 కేసుల్లో పట్టుబడిన మద్యం పుల్ బాటిళ్లలో ఉన్న మద్యం 10,222 లీటర్ల అంచనా మద్యాన్ని ధ్వంసం చేశారు. పట్టుబడిన మద్యం సీసాలను ఒక ఖాళీ స్థలంలో పోసి వాటిపై రోలర్స్ను తిప్పడంతో మద్యం బాటిళ్లు పలికి మద్యం నేలపాలు అయ్యింది. ఈ మద్యం విలువ రూ. 1,83,42,763 విలువ ఉంటుందని డిప్యూటి కమిషనర్ దశరధ్ తెలిపారు. వివిధా రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లోంచి మద్యం తక్కువ ధరలకు లభిస్తుందని భావించిన కొందరు తక్కువ ధరలకు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు తెలంగాణలో అమ్మకాలు జరపాలని కొందరు తీసుకు వస్తే మరి కొందరు తమ స్వంత అవసరాలకు వాడుకోవడానికి తీసుకుని వస్తారు.

కానీ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి మద్యం తీసుకురావడానికి అనుమతి ఉండాలి. మద్యాన్ని తీసుకు రావడానికి అవసరమైన పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ విషయంలో పర్యాటకులు కానీ, ఇతర వ్యక్తులు కానీఆ తక్కువ ధరలకు లభిస్తుందని మద్యాన్ని తీసుకు రావద్దని డిప్యూటి కమిషనర్ సూచించారు. ఇలా మద్యాన్ని తీసుకు వస్తే ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు. ఫంక్షన్లలో కూడా నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. డిప్యూటి కమిషనర్‌తో పాటు ఎక్సైజ్ సూపరిండెంట్ కృష్ణప్రియ, అసిస్టెంట్ సూపరిండెంట్ శ్రీనివాసరెడ్డి, శంషాబాద్ ఎస్ హెచ్ ఓ గండ్ర దేవేంద్ర రావుతోపాటు ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు , కానిస్టేబుళ్లు ఈ మద్యం ధ్వంసం కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News