- Advertisement -
న్యూఢిల్లీ: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడి పలవుమార్లు నోటీసులు ఇచ్చి విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనపై ఈడి అధికారుల విచారణ ఆపివేయాలంటూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, లిక్కర్ కేసులో మరోసారి విచారణకు హాజరవ్వాలంటూ గురువారం కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.
దీంతో ఈడీ అధికారాలను సవాల్ చేస్తూ సుప్రీంలో కవిత పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారని కవిత సవాల్ చేశారు.అయితే, కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.
Also Read: ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి నుంచి పేదలను కాపాడుతున్నాం: సిఎం కెసిఆర్
- Advertisement -