జైపూర్: ఆర్‌టిఐ కార్యకర్త కాళ్లు చేతులు విరగ్గొట్టి అనంతరం కాళ్లలో మేకులు దించిన సంఘటన రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమ్రారామ్ గోదారా (30) అనే ఆర్‌టిఐ కార్యకర్త తన గ్రామంలో జరిగే అవినీతి, మద్యం అక్రమ అమ్మకాలపై ఫిర్యాదు చేశాడు. మద్యం మాఫియాకు ఆ విషయం తెలియడంతో అతడిని డిసెంబర్ 21న కారులో కిడ్నాప్ చేశారు. ఆయనపై ఇనుప రాడ్లతో దాడి చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. అనంతరం కాళ్లలో మేకులు కొట్టి చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. స్థానికులు అతడిని జోధ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌పి దీపక్ బార్గవ్ ఆస్పత్రికి వెళ్లి అమ్రారామ్‌ను పరామర్శించారు. గోద్రా పోలీసులు మద్యం మాఫికా సమాచారం అందించినట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ పి తెలిపాడు.
ఆర్‌టిఐ కార్యకర్త కాళ్లు చేతులు విరగ్గొట్టి… కాళ్లలో మేకులు దించి
- Advertisement -
- Advertisement -
- Advertisement -