Monday, January 20, 2025

గుజరాత్‌లో లిక్కర్ పర్మిట్లు భారీగా పెరుగుదల

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : గుజరాత్‌లో ఆరోగ్య కారణాలుగా మూడేళ్లలో విడుదల చేసి మద్యం పర్మిట్ల హోల్డర్ల సంఖ్య 58 % పెరిగినట్లు రాష్ట్ర ప్రొహిబిషన్, అబ్కారీ శాఖ వెల్లడించింది. 2020 నవంబర్‌లో 27452 మద్యం పర్మిట్లు విడుదల చేయగా, ఇప్పుడు ఆ పర్మిట్ల హోల్డర్ల సంఖ్య 43470కి పెరిగిందని డేటా వెల్లడించింది, మహాత్మా గాంధీ జన్మించిన రాష్ట్రం అయినందున ఆల్కహాలిక్ ద్రవ్యాల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగాన్ని గుజరాత్ అవతరించినప్పటి నుంచి నిషేధించడమైంది. రాష్ట్ర జనాభా సుమారు 6.7 కోట్లు ఉంటుందని అంచనా. మద్య నిషేధ శాఖ సీనియర్ అధికార సమాచారం ప్రకారం, ఆరోగ్య కారణంగా పర్మిట్లు విడుదల అయి వారి సంఖ్య కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినవారు, విదేశీ పౌరులకు రాష్ట్ర పర్యటనల సమయంలో గరిష్ఠంగా ఒక ఏడాది పాటు పర్మిట్ కేటాయించనున్నట్లు ఆ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News