Friday, January 17, 2025

31న మామూలుగా తాగలేదు…. రూ.658 కోట్లు మద్యం హాంఫట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలు అంటే మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు సుక్క, ముక్కతో గడుపుతారు. సాయంత్రం కూర్చుంటే రాత్రి మొత్తం మందులోనే మునిగిపోతారు జనాలు. ఆదివారం ఏ వైన్స్ ముందు చూసినా భారీ క్యూ నెలకొంది. వైన్స్ దగ్గర జనాలు కాటన్ కాటన్లు మందు సీసాలు తీసుకెళ్లారు. ఈ నెల 29 నుంచి 31 వరకు రూ.658 కోట్ల మేర మద్యాన్ని విక్రయించారని అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఈవెంట్లు ఫిక్స్ చేయడంతో క్లబ్బులు, పబ్‌లకు పెద్ద ఎత్తున మద్యం తరలించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచి ఉంచారు. ఈ మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు అబ్కారీ శాఖ అధికారులు వివరించారు. ఆదివారం ఒక్క రోజు 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగినట్టు సమాచారం. ప్రతి ఆదివారం అయితే 3 లక్షల కిలోల మాంసం విక్రయాలు జరుగుతాయని వెల్లడించారు. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడుపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News