ఈసారి రూ.65 కోట్ల అధిక ఆదాయం
2024,-25 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.34,600 కోట్లు
531 లక్షల కేసుల బీర్లు, 369 లక్షల కేసుల మద్యం విక్రయాలు
జరిపిన ఆబ్కారీ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో ఏడు శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. 2024,-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.34,600 కోట్లు రాగా, గత సంవత్సరం (2023,-24) ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆదాయం రూ.34,535 కోట్లు వచ్చిందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక, గతేడాది పోలిస్తే 2024-,25 సంవత్సరంలో రూ.65 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది. 2024,-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖ రెవెన్యూ రూ.18,598.95 కోట్లు రాగా, వ్యాట్ రూపంలో రూ.15,999 కోట్లు వచ్చింది. మొత్తంగా 2024,-25 ఆర్థిక సంవత్సరంలో రూ.34,597.95 కోట్లు ఆదాయాన్ని ఆబ్కారీ శాఖ రాబట్టింది. గత సంవత్సరం కన్నా ఈసారి రూ.65 కోట్ల అధిక ఆదాయం వచ్చిందని ఎక్పైజ్ శాఖ అధికారులు తెలిపారు. 2023,-24 ఆర్థిక సంవత్సరంలో పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖ రెవెన్యూ రూ.17,653.88 కోట్లు రాగా, వ్యాట్ రూపంలో రూ.14,570.08 కోట్ల ఆదాయం వచ్చింది.
2024, -25 ఆర్థిక సంవత్సరంలో 531 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు
2023-, 24 సంవత్సరంలో 548 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా, 2024, -25 ఆర్థిక సంవత్సరంలో 531 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాల్లో ఈసారి 3 శాతం బీర్ల అమ్మకాలు తగ్గాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. గతంలో బీర్ల కంపెనీలు 15 రోజుల పాటు బీర్ల సరఫరా నిలిపివేయడంతో బీర్ల అమ్మకాలు కొద్దిమేర తగ్గినట్టుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2023,-24లో 362 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరగ్గా, 2024-, 25లో 369 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. 2024-,25 అర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్ సేల్స్ పెరగడం విశేషం.
2015,-16 అర్థిక సంవత్సరంలో రూ. 12,706 కోట్లు మద్యం
ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. 2015,-16 అర్థిక సంవత్సరంలో రూ. 12,706 కోట్లు మద్యం అమ్మకాలు జరగ్గా, 2016-,17 అర్థిక సంవత్సరంలో రూ. 14,184 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇక, 2017,-18 అర్థిక సంవత్సరంలో రూ. 17,594 కోట్లు, 2018-,19 అర్థిక సంవత్సరంలో రూ. 20,859 కోట్లు, 2019-,20 అర్థిక సంవత్సరంలో రూ. 35,145 కోట్లు, 2020,-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 27,288 కోట్లు, 2021-,22 అర్థిక సంవత్సరంలో రూ. 30,783 కోట్లు, 2022,-23 అర్థిక సంవత్సరంలో రూ. 35,145 కోట్లు, 2023,-24లో ఆర్థిక సంవత్స రంలో రూ.34,535 కోట్లు, 2024,-25 ఆర్థిక సంవత్సరంలో రూ.34,600 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది.