Sunday, December 22, 2024

ఒక్కరోజులో రూ.18 కోట్లు హుష్ కాకి!.. న్యూ ఇయర్ పార్టీలకు ఖర్చు

- Advertisement -
- Advertisement -

న్యూ ఇయర్ పార్టీలకు ఖర్చు
మద్యానికి రూ. 7.8 కోట్లు
చికెన్, మటన్‌కు రూ. 6.5 కోట్లు
కేకులకు రూ. 3 కోట్లు

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మద్యం వినియోగం బాగా పెరిగింది. డబ్బును మంచి నీటి ప్రాయంగా ఖర్చు చేసిన తీరు విస్మయానికి గురి చేసింది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్ర మంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్ల వారు జాము వరకు అనేక పార్టీలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రం మొదలుకుని మారుమూల గ్రామాల వారు జో రుగా ధావత్‌లు చేసుకున్నారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు జరిగాయి.

ఈ కారణంగా ఎక్సై జు శాఖకు దండిగా ఆదాయం సమకూరింది. ఏ వైన్ షా పువద్ద చూసినా…చికెన్, మటన్ షాపుల వద్ద చూసినా… ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోళ్లు జ రుగుతూనే ఉన్నాయి. వైన్స్ వద్ద క్యూలు కనిపించాయి. కొత్తగా ఏర్పాటు ఏసినా లిక్కర్ మార్టు వద్ద కాస్ట్‌లీ మం దుకు కూడా మద్యం ప్రియులు ఎగబడ్డారంటే మందు బాబుల జోష్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కు టుంబ సమేతంగాకొందరు,స్నేహితులతో ఇంకొందరు, ఇలా కొత్త సంవత్సర పార్టీ చేసుకున్నారు. సంగారెడ్డి, ఆర్‌సిపురం, పటాన్‌చెరు, జిన్నారం, గుమ్మడిదల, స దాశివపేట, మునిపల్లి, జోగిపేట, జహీరాబాద్, ఝరాసం గం,న్యాల్‌కల్, కోహిర్,రాయికోడ్, వట్‌పల్లి, హత్నూ ర, కంగ్టి, కల్హేర్, మనూర్, నాగలిగిద్ద, మొగుడంప ల్లి, కొం డాపూర్ తదితర ప్రాంతాల్లో కొత్త సంవత్సర పార్టీలు గంటల పాటు జరిగాయి. జిల్లాలోని వైన్ షాపుల ద్వారా 9085 కేసుల విస్కీ, బ్రాందీ ,ఇతర మద్యం విక్ర యం జరిగాయి.

ఒక 5548 కేసుల బీర్లు అమ్ముడు పో యా యి. ఆవిధంగా దాదాపుగా 7.80 కోట్ల రూపాయ ల మ ద్యాన్ని తాగా పడేశారు. ఇక జిల్లాలోని 720 చికె న్, మ టన్ షాపులుండగా,దాదాపుగా 6.5 కోట్ల రూపాయల మాంసం అమ్మకాలు జరిగాయని అంచనా…జిల్లాలోని 250 బేకరీ షాపుల ద్వారా 3 కోట్ల రూపాయల వి లువై న కేకులు అమ్ముడు పోయాయి. ఈ లెక్కన దాదాపు గా 18 కోట్ల రూపాయలు కొత్త సంవత్సర సంబురాలకు ఖ ర్చు చేశారు. సంతోషం వచ్చినా..విషాదం వచ్చి నా.. ఇ టీవల కాలంలో పార్టీలు చేసుకోవడం ఎక్కువై పో యింది.

నూతన సంవత్సరా కావడంతో ఈ కల్చర్ మరింతగా పెరిగింది. ఈవిధంగా మద్యం మత్తులో మందు ప్రియు లు జోగుతుండా.. ప్రభుత్వానికి ఆదా యం సమకూరుతున్నది. రాత్రి సమయంలో సంగారెడ్డిలోని ప్రధాన రహదారిలో ఎస్‌పి రూపేష్ స్వయంగా తనిఖీలు జరిపారు. దీం తో పార్టీ ముగించుకుని తిరుగు ప్రయాణమైన చాలా మంది మందు బాబులు దొరికి పోయారు. మరి కొం ద రు ఇ తర మార్గాల్లో ఇళ్లకు చేరారు. సోమవారం ఒకటో తేదీన సెలవుదినం కావడంతో అక్కడక్కడా మళ్లీ మందు పార్టీలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News