Sunday, December 22, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాం: కవితపై ఎవరు వ్యాఖ్యలు చేయకూడదని సివిల్ కోర్టు ఆదేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉన్నట్లు బిజేపి ఎంపీ పర్వేశవర్మ ఆరోపించిన నేపథ్యంలో ఆమె సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై కోర్టు విచారణ జరపగా…  కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేశారని, ప్రజా జీవితంలో ఉన్న ఆమె పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని న్యాయవాది పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు కావడంతోనే మీడియాలో కథనాలు వచ్చాయని కోర్టుకు తెలిపారు. లిక్కర్ స్కామ్ లో కవిత ద్వారా రూ.4.5కోట్లు మనీష్ సిసోడియాకు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారని, బాధ్యత యుతమైన పదవిలో ఉన్నవారు ఆధారాలతో ఆరోపణలు చేయాలి.. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని వివరించారు. పలు మీడియాలో వచ్చిన వరుస కథనాలను కోర్టుకు సమర్పించారు. ప్రతివాదులు ఆమెకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలి న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న అనంతరం కోర్టు.. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఎవరు వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా, మీడియా ముందు ఎలాంటి వాఖ్యలు చేయకూడదని పేర్కొంది.ఈ కేసులో కవితపై ఆరోపణలు చేసిన బిజేపి ఎంపీ పర్వేశవర్మ, మాజీ ఎమ్మెల్యే ముజంధర్ సిర్సాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.

Liquor Scam: Civil Court hearing on MLC Kavitha Petition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News