Monday, January 20, 2025

Liquor Scam: ఎంఎల్‌సి కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇడి సమన్లు రద్దు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ వేశారు.

అదేవిధంగా మద్యం కుంభ కోణంలో తన నివాసంలో గాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని తనను విచారణ చేయాలని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. తనను ఇడి అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్ పై సుప్రీం ధర్మసనం సోమవారం విచారణ జరపనుంది. మరోవైపు ఎంఎల్‌సి కవితను ఇడి అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారించిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News