Monday, December 23, 2024

రెండు రోజులు మద్యం షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులు బంద్ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు శ్రీనివాస రెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని కల్లుదుకాణాలు, వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News