Friday, November 22, 2024

48 గంటల పాటు మద్యం షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

కమిషనర్ ఆదేశాల మేరకు షాపులపై నిఘా పెంచిన ఎక్సైజ్ బృందాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని మద్యం షాపులు, బార్‌లు, పబ్‌లను మూసివేశారు. ఎక్సైజ్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీసులు షాపుల మద్యం షాపుల మూసివేతను తమ బృందంతో కలిసి పర్యవేక్షించారు. ఇప్పటికే ఈ విషయమై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈనెల 30వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత మద్యం షాపులను తిరిగి ఓపెన్ చేయనున్నారు. దాదాపు 48 గంటల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపులు ఖాళీ అయ్యాయి. బ్రాండెడ్ లిక్కర్ ఏదీ అందుబాటులో లేదు. టాప్ బ్రాండ్ల లిక్కర్ మొత్తం అమ్ముడైపోయింది. కేవలం ఒకటీ, రెండు బ్రాండెడ్ లిక్కర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వారం రోజులుగా బ్రాండెడ్ మద్యం నో స్టాక్
ఇక బీర్ల విషయానికి వస్తే వారం రోజులుగా కేవలం కింగ్ ఫిషర్ బీరు మాత్రమే లభిస్తుంది. మిగతా బ్రాండెడ్ బీర్లు అస్సలు దొరకడం లేదు. దీంతో మందు ప్రియులు చేసేది లేక ఉన్న బ్రాండ్లతోనే గొంతు తడుపుకుంటున్నారు. పోలింగ్ దగ్గర పడటంతో పాటు లిక్కర్ షాపులు మూసివేత ఉండడంతో ముందు జాగ్రత్తగానే ఆయా పార్టీల టీమ్స్ పెద్ద ఎత్తున లిక్కర్ నిల్వ చేసుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే లైసెన్స్లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్ 3వ తేదీ కూడా మద్యం షాపులు మూసి ఉంటాయి.

Wine shops closed

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News