Friday, December 20, 2024

మద్యం షాపులకు నేడు లక్కీ డ్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో నేడు లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీడ్రా ద్వారా ఎంపికను చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఫంక్షన్ హాళ్లలో శాంతియుత వాతావరణం లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశా రు. దరఖాస్తు దారులు మాత్రమే లక్కీ డ్రా వద్దకు వచ్చే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు రికార్డు స్థాయిలో 1,31,964 దరఖాస్తుల వచ్చాయి. శంషాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ అబ్కారీ జిల్లాలకు లక్కీ డ్రా నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించారు. అధికంగా దరఖాస్తులు వచ్చిన చోట డ్రా కార్యక్రమం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. డ్రాలో లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారి 24 గంటల్లో లైసెన్స్ ఫీజు మొత్తంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News