Wednesday, January 22, 2025

నిబంధనల ప్రకారం మద్యం షాపులను ఏర్పాటు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మద్యం దుకాణాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నియంత్రించాలి
ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. మద్యం దుకాణాల కేటాయింపును విజయవంతంగా పూర్తి చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల మద్యం దుకాణాల డ్రాలో షాపులను దక్కించుకున్న మద్యం దుకాణాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నియంత్రించాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర సరిహద్దు వెంట ఉన్న చెక్ పోస్ట్‌లను మరింత బలోపేతం చేయాలని, నకిలీ మద్యం తయారీ, అమ్మే వ్యక్తులపై పిడి యాక్ట్‌ను నమోదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టులలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద రవాణా శాఖ చెక్ పోస్ట్ తో కలిపి సమీకృత తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ ఫరూఖీ, జాయింట్ కమిషనర్ కెఏబి శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్‌లు చంద్రయ్య గౌడ్, శ్రీనివాస్, ఈఎస్‌లు ఏ. సత్యనారాయణ, టి. రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజయభాస్కర్ గౌడ్, పవన్, విజయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News