Friday, December 20, 2024

28 సాయంత్రం నుంచి 30వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలి: ఈసి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మంళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈసి ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిచినా, అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అక్రమమద్యం రవాణాపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఈసి ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News