Sunday, December 22, 2024

ఈ నెలలో మూడు రోజుల పాటు మద్యం షాపుల మూసివేత

- Advertisement -
- Advertisement -

ఎన్నికల సంఘం ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ నెలలో మూడు రోజులు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం వైన్‌షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే మూడు రోజులు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసేందుకు ఈసి ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా వీటిని ఊల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News