Sunday, December 22, 2024

ఈ నెల 25న మద్యం షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

హోలీ సందర్భంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను బంద్ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం షాపులు, కల్లుదుకాణాలు, రెస్టారెంట్లు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

బార్లు, స్టార్ హోటళ్లు, రిజిస్ట్రర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉన్నట్లు పేర్కొన్నారు. హోలీ సందర్భంగా ఎలాంటి న్యూసెన్స్ చేయవద్దని, బైక్‌లపై తిరుగుతూ అరుస్తూ, రంగులు పూయవద్దని, రోడ్లపై హోలీ వేడుకలు చేసుకోవద్దని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News