Sunday, November 24, 2024

పారదర్శకంగా మద్యం దుకాణాల డ్రాలను నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

Liquor store draws should be conducted transparently

అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశం
ఆబ్కారీ శాఖ అధికారులకు అభినందనలు

హైదరాబాద్: పారదర్శకంగా మద్యం దుకాణాలకు లాటరీలను నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కొత్త మద్యం దుకాణాలకు 67, 849 దరఖాస్తులు రావడంపై ఆబ్కారీ అధికారులను ఆయన అభినందించారు. ఆబ్కారీ అధికారులు నిబద్ధతతో పని చేయడం వల్లే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని ఆయన కితాబునిచ్చారు.

దరఖాస్తుల రూపంలో రూ.1,357 కోట్ల ఆదాయం

గురువారం మద్యం షాపుల దరఖాస్తులకు ఆఖరు కావడంతో రాత్రి ఒంటిగంట వరకు ఆబ్కారీ శాఖ అధికారులు దరఖాస్తులను లెక్కించారు. రాష్ట్రవ్యాప్తంగా 67,849 దరఖాస్తులు రాగా ఒక్కో షాపునకు సుమారుగా 26 దరఖాస్తులు వచ్చాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. దరఖాస్తుల ద్వారా సుమారుగా రూ.1,357 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకూరింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు గాను 131 ఎస్టీలకు, 262 ఎస్సీలకు, 393 గౌడ్స్‌లకు రిజర్వేషన్‌ల కింద ప్రభుత్వం కేటాయించగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని షాపులను నేడు (శనివారం) డ్రా ద్వారా వీటిని కేటాయించనున్నారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 35,762 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

122 మద్యం దుకాణాలకు ఏకంగా 6,212 దరఖాస్తులు

అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 122 మద్యం దుకాణాలకు ఏకంగా 6,212 దరఖాస్తులు రావడంతో ఒక్కో మద్యం దుకాణానికి 51 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతోపాటు కొత్తగూడెం ఎక్సైజ్ జిల్లాకు 88 మద్యం దుకాణాలకు ఏకంగా 4 వేల 270 దరఖాస్తులు రాగా, ఒక్కో మద్యం దుకాణానికి 48 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని 59 మద్యం దుకాణాలకు 1,572 దరఖాస్తులు రాగా అధికంగా పెద్దవంగరలోని దుకాణానికి 69, అత్యల్పంగా గంగారంలోని దుకాణానికి 12 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 230 దుకాణాలకు గాను 4వేల 700 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ. 94 కోట్ల ఆదాయం సమకూరింది.

2015, 17 సంవత్సరంలో రూ.498 కోట్ల ఆదాయం

2015, 17 సంవత్సరానికి సంబంధించి ఎక్సైజ్ శాఖకు దరఖాస్తులు రూపంలో రూ.498 కోట్ల ఆదాయం రాగా 35 వేల దరఖాస్తులు వచ్చాయి. 2017, 19 సంవత్సరానికి రూ.968 కోట్ల ఆదాయం రాగా, 48,401 దరఖాస్తులు, ప్రస్తుతం కొత్త మద్యం పాలసీలో భాగంగా 2021, 23 సంవత్సరానికి గాను రూ.1,357 కోట్ల ఆదాయం రాగా 67,849 దరఖాస్తులు వచ్చాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News