Friday, December 27, 2024

దాబా వద్ద వ్యాపారి హత్య

- Advertisement -
- Advertisement -

హర్యానాలో ఓ వ్యాపారవేత్తను దుండగులు పట్టపగలే ఓ దాబా వెలుపల దారుణంగా చంపివేశారు. ముర్తాల్ గ్రామంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఓ దాబా పార్కింగ్ స్థలంలో వ్యాపారి తన కారులో పడుకుని ఉన్నాడు. అక్కడికి చేరుకున్న దుండగులు ఆయనను కారు నుంచి బయటకు లాగి గన్‌తో కాల్పులు జరిపినట్లు, ఈ ఘటనలో ఆయన చనిపోయినట్లు వెల్లడైంది. అక్కడి ఆధారాల క్రమంలో మృతి చెందిన వ్యక్తిని సుందర్ మాలిక్‌గా గుర్తించారు. గోహానాలోని సారాగ్గతయ్ గ్రామానికి చెందిన ఆయన మద్యం వ్యాపారి అని నిర్థారణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News