Friday, January 24, 2025

ఎల్విస్ కూతురు లీసా మేరీ ప్రెస్లీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ప్రముఖ పాప్ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ కుమార్తె లీసా మేరీ ప్రెస్లీ(54) గురువారం కన్నుమూశారు. ఎల్విస్ అడుగుజాడల్లోనే ఆమె నడిచారు. మ్యూజిక్‌నే తన కెరీర్‌గా ఎంచుకున్నారు. మూడు ఆల్బమ్స్ రూపొందించారు. లీసా మేరీ ప్రెస్లీ గుండెపోటు కారణంగా కాలిఫోర్నియా హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్‌లో కన్నుమూశారు. ఆమె మంగళవారం రాత్రి జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమంఓ కూడా పాల్గొన్నారు. రాక్ అండ్ రోల్ దిగ్గజం ఎల్విస్ ప్రెస్లీ కథాంశంతో తెరకెక్కిన ‘ఎల్విస్’ సినిమాలో ప్రధాన పాత్రను పోషించిన ఆస్టిన్ బట్లర్‌కు ‘బెస్ట్ యాక్టర్ అవార్డు’ దక్కింది. ఈ కార్యక్రమానికి లీసా, ఆమె తల్లి ప్రిసిల్లా ప్రెస్లీ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా తన తండ్రిని తలచుకుని లీసా కన్నీటిపర్యంతం అయ్యింది. ఇది జరిగి కొన్ని గంటలు గడవక ముందే ఆమె కన్ను మూయడం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఎల్విస్ ప్రెస్లీ ఏకైక కూతురు లీసా మేరీ ప్రెస్లీ. ఆమె రిలే కీఫ్‌కు తల్లి. రిలే కీఫ్ ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’ లో నటించాడు.

Presley daughter Lisa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News