Sunday, December 22, 2024

40 మందితో బిజెపి ప్రచారకర్తల జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ, అమిత్‌షా, నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు
తెలంగాణకు చెందిన 19మందికి అవకాశం
ప్రచారానికి రాములమ్మ దూరం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బిజెపి ప్రకటించింది. లిస్టులో 40 మందికి చోటు కల్పించింది. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీకి స్థానం కల్పించింది. అలాగే యడ్యూరప్ప, లక్ష్మణ్, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురుగన్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్, రవికిషన్, ఏపీకి చెందిన నేత పురంధేరశ్వరిని నియమించింది.

అదే విధంగా తెలంగాణకు చెందిన 19 మంది నేతలకు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు లభించింది. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డికె. అరుణ, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌కుమార్, సోయం బాపూరావు, రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణ ప్రసాద్ పేర్లను స్టార్ క్యాంపెయినర్ల జాబితాల్లో అవకాశం కల్పించింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి చోటు లేక పోవడం పార్టీ మారుతుందనే చర్చ సాగుతుంది.

DK Aruna and Vijay Shanti

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News