Tuesday, December 24, 2024

నటి సోనాక్షి సిన్హా తిరస్కరించిన ఐదు సినిమాలు…

- Advertisement -
- Advertisement -

ముంబై: హిందీ నటి సోనాక్షి సిన్హా 2010లో చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారి ‘దబంగ్’సినిమాలో సల్మాన్ ఖాన్‌కు హిరోయిన్‌గా నటించి పేరు తెచ్చుకుంది. విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో ఆమెది భిన్నమైన శైలి. బాలీవుడ్‌లో ఇప్పటికే ఆమె 13 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది. ఆమె ‘దబంగ్’, ‘రౌడీ రాథోడ్’, ‘సన్ ఆఫ్ సర్దార్’ తదితర చిత్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సోనాక్షి సిన్హా నేడు 36 ఏళ్లలో పడింది. వివిధ కారణాలతో ఆమె కొన్ని చిత్రాలను తిరస్కరించింది.

1. హసీనా పార్కర్
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రాహీమ్ సోదరి జీవిత చరిత్రతో 2017లో ఈ చిత్రం వచ్చింది. తొలుత ఈ సినిమా చేయాలని సోనాక్షి సిన్హాకు ఆఫర్ వచ్చింది. సోనాక్షిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా స్కిప్ట్ రాశారు. దీనికి డైరెక్టర్ అపూర్వ లాఖియా. అయితే అప్పట్లో సోనాక్షి ‘ఫోర్స్ 2’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉండింది. డేట్స్ ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సినిమా శ్రద్ధ కపూర్‌కు వెళ్లింది. ఈ సినిమా ప్లాట్‌కైతే ప్రశంసలు వచ్చాయి. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. బాక్సాఫీసులో కూడా ఏమంత రాబట్టలేదు.
2. ఉడ్తా పంజాబ్
ఈ సినిమాను ఇతర కమిట్‌మెంట్ల కారణంగా సోనాక్షి వదులుకుంది. అయితే ఆమెకు బదులు కరీనా కపూర్ ఖాన్ నటించింది. దిల్‌జిత్ దోసాంజ్ ఈ సినిమాలో హీరో. ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలనైతే అందుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద పెద్ద విజయాన్ని సాధించలేదు.
3.ముబారకా
ఇదో రోమాంటిక్ కామెడీ సినిమా. ఇందులో అనీల్ కపూర్, అర్జున్ కపూర్ వంటి వారు నటించారు. ఈ సినిమాను కూడా సోనాక్షి తిరస్కరించింది. తనకు ఆఫర్ చేసిన పాత్ర అంతగా నచ్చలేదామెకు. స్క్రీన్ టైమ్ కూడా తగినంత లేదని అభిప్రాయపడి వదులుకుంది.
4. రేస్2
ఈ థ్రిల్లర్ సినిమాను సోనాక్షి వదులుకుంది. అప్పుడామె ‘దబంగ్2’ సినిమా షూటింగ్‌లో నిమగ్నమై ఉంది. తన షెడ్యూల్‌లో ఆమె ఈ సినిమాకు టైమ్ ఇవ్వలేకపోయింది.
5. చిరంజీవి 150వ చిత్రం
తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని కూడా సోనాక్షి సిన్హా తిరస్కరించింది. ఈ సినిమాలో సోనాక్షియే కాకుండా, కత్రినా కైఫ్, కరీనా కపూర్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలకు ఎంపికయ్యారు. కానీ ఈ సినిమాను కూడా సోనాక్షి తిరస్కరించింది. ఓ న్యూస్ పోర్టల్ కథనం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్, పాత్రలో ఆమెకు ప్రత్యేకత ఏదీ కనిపించలేదట. ప్రస్తుతం కెరీర్ పరంగా సోనాక్షి సిన్హా ‘దహాడ్’ అనే సిరీస్‌లో నటించింది.
ప్రస్తుతం అది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అందులో ఆమె పోలీస్‌గా నటించింది. ఆమె తన పాత్రకు ప్రశంసలు కూడా అందుకుంది. తదుపరి ఆమె వేర్వేరు సినిమాల్లో కనిపించనున్నది. వాటిలో కకుడ, నికితా రాయ్, ద బుక్ ఆఫ్ డార్క్‌నెస్ ఉన్నాయి. ఆమె సంజయ్ లీలా బన్సాలీ యొక్క హీరామండిలో కూడా నటిస్తోంది. దానిని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇంతేకాకుండా సోనాక్షి, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియా, చోటే మియా’లో కూడా కనిపించనున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News