Sunday, December 22, 2024

జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నుంచి ఎంఐఎం పోటీ

- Advertisement -
- Advertisement -

మజ్లిస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ సారి మజ్లిస్ తొమ్మిదిస్థానాలనుంచి పోటీకి దిగుతున్నట్లు చెప్పారు. కొత్తగా జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నుంచి అభ్యర్ధులను నిలబెడుతున్నట్లు ఒవైసీ చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ నేతలు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈసారి పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు. వారిద్దరూ పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు. బహదూర్ పురా, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ మినహా మిగిలిన నియోజకవర్గాల అభ్యర్ధుల పేర్లను ఆయన ప్రకటించారు.

చాంద్రాయణగుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ

మలక్ పేట- అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా

కార్వాన్- కౌసర్ మొహియుద్దీన్

నాంపల్లి- మజీద్ హుస్సేన్

యాకుత్ పురా- జాఫర్ హుస్సేన్

చార్మినార్ – మీర్ జుల్ఫికర్ అలీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News