మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజనపై కసరత్తు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్ర భుత్వం 10 ఉమ్మడి జిల్లాలను ఏకంగా 33 జిల్లాలుగా చేసింది. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల ఒక్కో జిల్లా ను 5 ముక్కలుగా చేయడంతో పాలనాపరం గా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు సైతం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో అప్పటి కొందరు పెద్దలు చేసిన డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలను అధికంగా గత ప్రభుత్వం ఏర్పా టు చేయడంతో ప్రస్తుతం నిధుల సమస్య కూ డా ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ ప్రభు త్వం గుర్తించింది. దీంతోపాటు ఒక్కో ఎంపి నియోజకవర్గ పరిధిని 3 నుంచి -4 జిల్లాలుగా చేయడంతో నిధుల ఖర్చు విషయం వారికి సమస్యగా మారిందని, స్థానిక పరిపాలనలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే జిల్లాలను పునర్విభజన చే పట్టాలనిప్రభుత్వం నిర్ణయించింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల తరువాయి 10లో
సందర్భంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, కొత్త మండలాల ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే సిఎం రేవంత్‌రెడ్డి దానిపై కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జ్యుడిషీయల్ కమిటీ మార్గదర్శకాల మేరకు….
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు పునర్ వ్యవస్థీకరణ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే ఈప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. దీని కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఉన్నతాధికారులతో తెలంగాణలోనూ జ్యుడిషీయల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కమిటీ అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించి సభ్యులతో చర్చించి అనంతరం జిల్లాల కుదింపుపై నిర్ణయం తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
డీ లిమిటేషన్ ప్రకారం 1/3 జిల్లాలు
తెలంగాణలో మొత్తం పార్లమెంట్ నియోజక వర్గాలు 17 కాగా, వాటికి డీ లిమిటేషన్ ప్రకారమైతే 1/3 జిల్లాలు పెరుగనున్నాయి. అంటే 17+6 =23 జిల్లాలు అవుతాయి. అలాకాకుండా జనాభా లెక్కల ప్రకారం చేస్తే 22 జిల్లాలు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటు న్నాయి. అయితే జ్యుడిషీయల్ కమిషన్ నివేదికతో పాటు నిధులకు అనుకూలంగా ఉండేలా చివరకు 22 లేదా 23 జిల్లాలను ప్రభుత్వం ఫైనల్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొందరు అధికారులు మాత్రం పార్లమెంట్ నియోజక వర్గాలు 17 ఉండగా దానికి అనుగుణంగా, 17 జిల్లాలను చేయాలని దానివల్ల నిధులకు, ఖర్చుకు కూడా ఇబ్బందులు ఉండవని పేర్కొంటుండగా జ్యుడిషీయల్ నివేదికనే ఫైనల్ అని ప్రభుత్వం పేర్కొంటున్నట్టుగా తెలిసింది. రానున్న రోజుల్లో ఒకవేళ 17 జిల్లాలు చేస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని, రాజకీయంగా పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఆ వర్గాలు పేర్కొంటుండడం విశేషం. అయితే జ్యుడిషీయల్ కమిషన్ నివేదిక వచ్చిన తరువాత దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సిఎం రేవంత్ నిర్ణయించినట్టుగా సమాచారం.
రెండు జిల్లాల పేర్లు కూడా మార్పు
కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు (ఉమ్మడి వరంగల్ జిల్లాలోని) పివి నరసింహరావు పేరు పెడతామని, జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని ఇప్పటికే కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో ఆయా జిల్లాల ప్రజలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లాకు గోండు వీరుడు కొమురం భీం పేరును పెట్టగా, కొత్తగూడెం జిల్లాకు పుణ్యక్షేత్రం భద్రాచలం పేరును, భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, గద్వాల జిల్లాకు శక్తిపీఠం జోగులాంబ పేరు, భువనగిరి జిల్లాకు పుణ్యక్షేత్రం యాదాద్రి పేర్లను పెట్టారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రెండు జిల్లాల పేర్లను మార్చాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే, అందులో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలని అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.