Thursday, December 19, 2024

ఉన్నత విద్యావంతులలో దక్షిణ కొరియా టాప్: 43వ స్థానంలో భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాలలో దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉంది. భారత్ 43వ స్థానంలో నిలిచింది. అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాలలో యూరపు ముందువరుసగా ఉంది.

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 25 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసున్న భారతీయ పౌరులలో కేవలం 20 శాతం మంది మాత్రమే తృతీయ శ్రేణి ఉన్నత విద్యను పొందిన వారిలో ఉన్నారు. ఉన్నత విద్యను చదువుకున్నవారిలో 69 శాతంతో దక్షిణ కొరియా మిగిలిన దేశాలన్నిటికన్నా అగ్రస్థానంలో నిలిచింది. 67 శాతంతో కెనడా రెండవ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా, అత్యధిక తలసరి ఆదాయంతో ఉన్న లగ్జెన్‌బర్గ్ 60 శాతం విద్యావంతులతో తృతీయ స్థానంలో ఉంది. అయితే, జాబితాలో ఐరోపా దేశాలలో అమెరికా వెనుకబడి పోవడం ఆశ్చర్యకరం.

ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు గల 10 దేశాలు:
1 దక్షిణ కొరియా 69%
2 కెనడా 67%
3 జపాన్ 65%
4 ఐర్లాండ్ 83%
5 రష్యా 62%
6 లగ్జెంబర్గ్: 60%
7 లిథువేనియా 58%
8 బ్రిటన్ 57%
9 నెదర్‌ల్యాండ్స్ 56%

10 నార్వే 56%

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News