Thursday, November 21, 2024

ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు తమతమ కీలక ఆటగాళ్లను అట్టిపెట్టేసుకున్నాయి. ఈసారి కొంత మంది క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టేశారు. వీరిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్లాసెన్‌ను ఏకంగా రూ.23 కోట్లు వెచ్చించి హైదరాబాద్ రిటెన్ చేసుకుంది. అంతేగాక కెప్టెన్‌పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడిలను హైదరాబాద్ అంటిపెట్టుకుంది. కమిన్స్‌ను రూ.18 కోట్లకు, హెడ్‌ను రూ.14 కోట్లకు, నితీష్‌కుమార్‌కు రూ.8 కోట్లు, యువ సంచలనం అభిషేక్ శర్మను రూ.14 కోట్లను చెల్లించి రిటెన్ చేసుకొవాలని సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్ణయించింది. కాగా, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తదితరులను ఆయా ఫ్రాంచైజీలు వదులు కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

క్లాసెన్ సంచలనం..

కిందటి సీజన్‌లో హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు జాక్‌పాట్ లభించింది. గతంలో 5.5 కోట్ల రూపాయలకు హెన్రిచ్‌ను దక్కించుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి ఆ మొత్తాన్ని రూ.23 కోట్లకు పెంచింది. 2025 సీజన్‌లో ఏ ఆటగాడికి కూడా ఇంత పెద్ద మొత్తంలో ధర లభించలేదు. కానీ క్లాసెన్ మాత్రం అందరి అంచనాలు తారుమారు చేస్తూ రిటెన్షన్ జాబితాలో భారీ మొత్తం ధరను సొంతం చేసుకుని పెను ప్రకంపనలు సృష్టించాడు. ఇక రాజస్థాన్ ఆటగాడు ధ్రువ్ జురెల్ కూడా భారీ మొత్తం ధరను పలికాడు. అతన్ని రాజస్థాన్ టీమ్ ఏకంగా రూ.14 కోట్లు చెల్లించి రిటెన్ చేసుకుంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కెఎల్ రాహుల్‌ను వదులుకుంది.

ఈసారి విండీస్ స్టార్ నిలోలస్ పూరన్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఏకంగా 21 కోట్ల రూపాయలను చెల్లించి పూరన్‌ను అంటిపెట్టుకుంది. గుజరాత్ ఫ్రాంచైజీ అఫ్గాన్ సంచనలం రషీద్ ఖాన్‌ను రూ.18 కోట్లు చెల్లించి రిటెన్ చేసుకుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిని భారీ మొత్తం ధరను వెచ్చించి అంటిపెట్టుకుంది. ఈసారి కోహ్లికి రూ.21 కోట్లు చెల్లించనుంది. ముంబై ఇండియన్స్ జస్‌ప్రిత్ బుమ్రా కోసం రూ.18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యల కోసం చెరో రూ.16.35 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ముంబై రూ.16.30 కోట్లు చెల్లించనుంది. చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ కోసం రూ.18 కోట్లు చెల్లించి రిటెన్ చేసుకుంది. రవీంద్ర జడేజా కూడా రూ.18 కోట్లకు రిటెన్ అయ్యాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్‌హెడ్
పంజాబ్ కింగ్స్: శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్
లక్నో సూపర్‌జెయింట్స్: నికోలస్ పూరన్, రవిబిష్ణోయ్ , మయాంక్ యాదవ్, మోసి న్ ఖాన్, ఆయుశ్ బదోని
కోల్‌కతా నైట్‌రైడర్స్: రింకూ సింగ్, వరుణ్ చక్కవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, హర్షిత్ రాణా, రమన్‌దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, యశ్ దయాల్
ముంబై ఇండియన్స్: జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, తిలక్ వర్మ
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, మతీశ పతిరణ, శివమ్ దూబె, జడేజా, ఎంఎస్ ధోనీ
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, సందప్ శర్మ, ధ్రువ్ జురెల్
గుజరాత్ టైటాన్స్: రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News