Friday, December 20, 2024

భారత్‌కు అరుదైన ఘనత

- Advertisement -
- Advertisement -

లండన్ : ప్రపంచ అత్యుత్తమ టాప్ 10 పాఠశాలల జాబితాలో మన దేశానికి చెందిన ఐదు పాఠశాలలు స్థానం సంపాదించుకుని తమ సత్తా చాటుకున్నాయి. బ్రిటన్‌కు చెందిన వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజెస్ ఈ ద్వివార్షిక పోటీని నిర్వహించింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన ఈ ఐదు పాఠశాలలు వివిధ కేటగిరీల కింద స్ఫూర్తిదాయకమైనవిగా పరిగణించారు. ఢిల్లీకి చెందిన నగర్ నిగం ప్రతిభా బాలిక విద్యాలయ , ముంబైకి చెందిన ఒబెరాయ్ ఇంటర్నేషనల్ స్కూల్, షిండేవాడి ముంబై పబ్లిక్ స్కూల్, గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు చెందిన రివెర్‌సైడ్ స్కూల్, మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్‌కు చెందిన స్నేహాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎంపికయ్యాయి. సామాజిక సహకారం లోను, , పర్యావరణ కార్యాచరణ, నూతన ఆవిష్కరణ, ప్రతికూతలను అధిగమించడం, ఆరోగ్యకరజీవిత సహకారం తదితర ఐదు కేటగిరీల కింద ఈ పాఠశాలలను ఎంపిక చేశారు.

ఈ కేటగిరీలకు సంబంధించిన 2,50,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2 కోట్లు )నగదు బహుమతిని ఈ పాఠశాలలకు సమానంగా పంచుతారు. ఈ పాఠశాలలు రాబోయే తరం స్ఫూర్తి చెందేలా కీలక పాత్ర వహించాయని, ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి సమయంలో సమాజ పురోగతికి ఎంతో పాటు పడ్డాయని నిర్వాహకులు పేర్కొన్నారు. బ్రిటన్‌లో గత ఏడాది ఈ పోటీలను ప్రారంభించారు. యాక్సెంచర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యయాసన్ హసనా, లెమాన్ ఫౌండేషన్‌ల భాగస్వామ్యంతో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోన్న డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టి 4ఎడ్యుకేషన్ ద్వారా వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజ్‌లు 2022 లో నెలకొల్పబడ్డాయి. ఈ అవార్డుల వ్యవస్థాపకుడు వికాస్ పోటా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పాఠశాలలు అనుసరిస్తున్న వినూత్న పంథా చరిత్ర ప్రపంచం లోని పాఠశాలలు తెలుసుకుని స్ఫూర్తి పొందుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News