Monday, December 23, 2024

ధోకేబాజ్… సిగ్గులేదు… పార్లమెంట్‌లో ఇక పదాలు వాడకూడదు

- Advertisement -
- Advertisement -

List Of Words Banned In Parliament

న్యూఢిల్లీ : పార్లమెంటులో ప్రజోపయోగ చర్చల కంటే ఒకరినొకరు హద్దు మీరి దూషణలకు దిగుతుండటం పరిపాటిగా వస్తోంది. ఇకపై అలా ఇష్టానుసారి తిట్టుకోవడం కుదరదు. ఉభయ సభల్లో సభ్యులు ఒకరినొకరు తిట్టుకునేందుకు ఇప్పటివరకు ఉపయోగించిన కొన్ని పదాలను ప్రభుత్వం నిషేధించింది. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు కొన్ని పదాలు వాడకూడదని లోక్‌సభ సెక్రటేరియంట్ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం , అవినీతిపరుడు, అసమర్ధుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలను అన్‌పార్లమెంటరీ పదాలుగా గుర్తించింది. ఆ పదాలను ఇకపై ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీల్లేదని అందులో స్పష్టం చేసింది. అలాగే బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూజ్డ్, చీటెడ్, కరప్ట్, డిక్టేటోరియల్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, అన్‌ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్ వంటి ఇంగ్లీష్ పదాలను ఆ జాబితాలో చేర్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News