Tuesday, December 24, 2024

33 జిల్లాల్లో సాహిత్య కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యక్రమాలను 33 జిల్లాలకు విస్తృతం చేయాలని, ఇప్పటి వరకు వెలుగు చూడని సాహిత్యాన్ని వెలికితీసేందుకు చేయాల్సిన కృషిపై రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య, సాంస్కృతిక సలహాదారు కెవి రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జులూరు గౌరీశంకర్ చర్చించారు. సోమవారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో చైర్మన్ జులూరు గౌరీశంకర్‌తో రమణాచారి పలు అంశాలపై సమాలోచనలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. సిఎం కెసిఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని 33 జిల్లాలకు సాహిత్య అకాడమి కార్యక్రమాలను విస్తృత పరిచేందుకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని తీర్మానించారు. తెలంగాణ సాహిత్యచరిత్ర గ్రంథాన్ని జిల్లాల సాహిత్య చరిత్రలను త్వరలో వెలువరించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News