Wednesday, January 22, 2025

తెలంగాణ ఏర్పాటులో సాహిత్యానిది ముఖ్య భూమిక

- Advertisement -
- Advertisement -
  •  కవులు, కళాకారులతో ప్రజా చైతన్యం
  • జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి

వికారాబాద్: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో సాహిత్యం ముఖ్య పాత్ర పోషించిందని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. కవులు సాహిత్యంతో కళాకారులు ఆటపాటలతో తెలంగాణా ప్రజానీకాన్ని చైతన్యం చేశారని కొనియాడారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వికారాబాద్ లో జరిగిన సాహితీ దినోత్సవం కవిసమ్మేళనానికి సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణా ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సాహితి, సంస్కృతిక వికాసం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కవులను, సాహిత్య వేత్తలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News