విల్‌నియస్(లిథువేనియా): ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం అలుముకున్న నేపథ్యంలో రష్యా మిత్ర దేశమైన బెలారస్‌కు, కలినిన్‌గ్రాడ్‌కు సరిహద్దుల్లో ఉన్న నాటో సభ్య దేశం లిథువేనియా తమ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసే చర్యలకు ఆదేశిస్తూ లిథువేనియా అధ్యక్షుడు గిటానస్ నౌసెడ గురువారం ఎమర్జెన్సీ ఉత్తర్వులపై సంతకం చేశారు. సరిహద్దు ప్రాంతాలలో వాహనాలను, వ్యక్తులను, లగేజీని తనిఖీ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెడుతూ ఈ ఉత్తర్వులు జారీచేశారు. నాటో, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలైన పోలాండ్, లాట్వియాలతో కూడా లిథువేనియా సరిహద్దులను పంచుకుంటోంది. ఇదిలా ఉండగా&ఉక్రెయిన్‌పై చేపట్టిన చట్టవిరుద్ధ, అసమంజస ర్యను నిలిపివేయాలంటూ రష్యాకు టర్కీ పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆమోదయోగ్యం కాదని, వీటిని తాము తిరస్కరిస్తున్నామని టర్కీ విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. ఆయుధాల ద్వారా సరిహద్దులను మార్చే చర్యలను తాము అంగీకరించబోమని టర్కీ స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ సంక్షోభంతో లిథువేనియాలో ఎమర్జెన్సీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -