Wednesday, November 6, 2024

గర్భస్రావ హక్కుల రద్దుపై కోర్టుల్లో న్యాయపోరాటం

- Advertisement -
- Advertisement -

Litigation in the courts over the abolition of abortion rights

లూసియానా, యుటాల్లో తాత్కాలికంగా నిషేధం నిలుపుదల

న్యూఓర్లియన్స్ : గర్భస్రావ హక్కుకు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసిన తరువాత కొన్ని రాష్ట్రాల్లో దీనిపై నిరసనలు, ఆందోళనలు సాగుతున్నాయి. లూసియానా, యుటా ప్రాంతాల్లో గర్బస్రావ నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపు చేశారు. కోర్టుల్లో దీనిపై న్యాయ పోరాటాలు ముగిసిన తరువాత సుప్రీం తీర్పు ప్రకారం చట్టం అమలు చేస్తామని సౌత్ కరోలినా లోని ఫెడరల్ కోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు తరువాత వ్యాజ్యాలకు గేట్లు తెరుచుకున్నాయి. ఒకపక్క నిషేధం వెంటనే అమలు చేయాలని కోరుతుండగా, మరో పక్క దీన్ని ఆపాలని, కనీసం ఆలస్యమైనా చేయాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. 13 రాష్ట్రాల్లో చాలావరకు కోర్టులు ఈ చట్టాలను అమలు చేయడానికే సిద్ధమవుతున్నాయి. అబార్షన్ వ్యతిరేక చట్టాలను లక్షంగా చేసుకుని కొన్ని రాష్ట్రాల్లో వాజ్యాలు దాఖలవుతున్నాయి. తాము మళ్లీ కోర్టుకు వెళ్తామని సెంటర్ ఫర్ రిప్రొడక్షన్ రైట్స్ అధ్యక్షుడు నాన్సీ నార్తప్ పేర్కొన్నారు.

యుటా జడ్జి సోమవారం అబార్షన్ నిషేధాన్ని 14 రోజుల వరకు ఆపు చేశారు. ఈలోగా దీనిపై దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తారు. కన్సర్వేటివ్ రాష్ట్రమైన లూసియానాలో ఈ చట్టం అస్పష్టంగా ఉందని గర్భస్రావ హక్కుల ఉద్యమనేతలు వాదించడంతో తాత్కాలికంగా నిషేధాన్ని నిలిపివేసినట్టు లూసియానా లోని న్యూఓర్లియన్స్ జడ్జి తెలిపారు. జులై 8 నాటి విచారణకు ఇది పెండింగ్‌లో ఉంచారు. ఈ రాష్ట్రం లోని మూడు అబార్షన్ క్లినిక్స్‌లో ఒకటి తమ ప్రక్రియలు యథావిధిగా మంగళవారం ప్రారంభించామని హోప్ మెడికల్ గ్రూప్ ( మహిళల ఆస్పత్రి) అడ్మినిస్ట్రేటర్ కెథలిన్ పిట్‌మాన్ వివరించారు. లూసియానా జడ్జి తాత్కాలికంగా అమలును నిలిపివేయడంపై లూసియానా అటార్నీ జనరల్ జెఫ్ లాండ్రీ విమర్శించారు. ఈ చట్టం అమలుకు పోరాటం చేస్తామన్నారు. సౌత్ కరోలినాలో అబార్షన్ నిషేధంపై ముందు తాత్కాలికంగా విధించిన నిలుపుదలను ఎత్తి వేశారు. రాష్ట్రంలో నిషేధానికి వీలు కల్పించారు. టెక్సాస్, ఇడహో, కెంచుకి, మిసిసిపి ప్రాంతాల్లో గర్భస్రావహక్కుల నేతలు పరిమితుల నుంచి తప్పించడానికి సోమవారం కోర్టును ఆశ్రయించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News