Monday, December 23, 2024

లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌లో విద్యార్థినిపై కరస్పాండెంట్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: పిల్లలు తప్పులు చేస్తే దండించాల్సిన ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకొని పోయి నాలుగో తరగతి విద్యార్థినిపై పాఠశాల కరస్పాండెంట్ అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం జిల్లా కేంద్రంలో ఓ కంపెనీలో పని చేస్తూ తన ఇద్దరు కూతుళ్లను లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌లో చదివిస్తోంది. నాలుగో తరగతి చదువుతున్న బాలిక అదే స్కూల్లో హాస్టల్‌లో ఉంటుంది.

మధ్యాహ్నం సదరు బాలిక భోజనం చేసిన తరువాత ప్లేట్‌ను తన గదిలో పెట్టేందుకు వెళ్లింది. కరస్పాండెంట్ ఆంజనేయులకు బాలిక ఒంటరిగా కనిపించడంతో రూమ్‌లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక తన తల్లికి ఫోన్ చేసి ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో ఆమె తన బంధువులతో కలిసి పాఠశాలకు వచ్చింది. తల్లికి జరిగిన విషయం బాలిక చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆంజనేయులు గౌడ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అదే స్కూళ్లో పలవురు బాలికలను అతడు లైంగికంగా వేధించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News