Wednesday, January 22, 2025

ప్రభుత్వ పథకాలతో జీవనోపాధి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : ప్రభుత్వ పథకాలు శ్రీనిధి రుణం ద్వారా జీవనోపాధి పొందుతున్నారని ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానిక చెందిన మల్లవ్వ శేఖర్ కు ఆదర్శ మహిళా సంఘం ద్వారా 2 లక్షల 75000 వేల రూపాయలతో మంజూరైన ఎలక్ట్రికల్ ఆటోను ఆదివారం ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మల్లవ్వ శేఖర్ కుటుంబం ఆటో నడుపుతూ తన కూతురిని ప్రభుత్వ పాఠశాలలో చదివించారని తెలిపారు. వారి కూతురు ఎం బి బి ఎస్ లో ఫ్రీ సీటు సాధించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలలు శ్రీనిధి లోన్ ద్వారా ఇలాంటి కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఇంచార్జి ఎంపిపి ఉరుదొండ నరేష్, గ్రామ సర్పంచ్ చింతల రవితేజ గౌడ్, శ్రీనిధి చైర్మన్ కిరణ్, ఐకేపి సిసి అంజగౌడ్, పిఏసిఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, విశ్వనాథ్, శేఖర్, జగదీష్, ప్ర భాకర్ రెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News