Tuesday, September 17, 2024

తుపాన్‌లో నౌకమునక.. ఇద్దరే మిగిలారు

- Advertisement -
- Advertisement -

Livestock ship with 42 crew sank off Japan coast

టోక్యో : జపాన్ తీరంలో ఓ నౌక మునిగిన ఘటనలో నౌక సిబ్బందిలో రెండో వ్యక్తిని, పలు సంఖ్యలో చనిపోయిన ఆవులను కనుగొన్నారు. పశువుల రవాణాకు వినియోగించే ఈ నౌక సముద్రంలో భారీ స్థాయిలో తుపాన్ చెలరేగిన ఘటనలో నీట మునిగిందని భావిస్తున్నారు. సమాచారం తెలియగానే ఈస్ట్ చైనా సీలోని అమామీ ఒషియాకు వాయవ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దశలో నీటిలో తేలుతున్న వ్యక్తిని స్పృహ కోల్పోయి ఉన్న స్థితిలో గుర్తించారు. ఈ వ్యక్తి ఏ దేశానికి చెందిన వాడు? నౌక పరిస్థితి ఏమిటి? అనేవి వెల్లడికాలేదు. ముందుగా ఈ వ్యక్తిని చికిత్సకు సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

43 మంది సిబ్బందితో, 5800 ఆవులతో ఉన్న ఈ 11,947 టన్నుల బరువు నౌక ఆగస్టు మధ్యలో న్యూజీలాండ్ నుంచి బయలుదేరింది. చైనా తూర్పు తీరపు టాంగ్షాన్‌కు చేరుకోవల్సి ఉంది. రెండు మూడు రోజుల క్రితమే ఈ ఫిలిపినో షిప్ ప్రధాన అధికారి అయిన 45 ఏండ్ల ఎడ్వర్డో సరెనోను తీర రక్షక దళాలు రక్షించాయి. నౌక మునక దశలో ఆయన లైఫ్ జాకెట్ వేసుకుని సముద్రంలోకి దూకినట్లు, దీనితో ప్రాణాలు దక్కించుకున్నట్లు వెల్లడైంది. ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉన్న మరో వ్యక్తిని గుర్తించి రక్షించారు. ఇతర సిబ్బంది ఏమైందనేది తెలియలేదు. అయితే మూగజీవాలైన ఆవులు అన్ని దిక్కుతోచని స్థితిలో మృతి చెంది తేలుతూ కన్పించాయి. మేసాక్ తుపాన్ దక్షణ జపాన్ వైపు భీకరంగా దూసుకువస్తున్న దశలో వెళ్లుతున్న ఈ నౌక తట్టుకోలేక మునిగినట్లు భావిస్తున్నారు. దుబయ్‌కు చెందిన గల్ఫ్ నౌకాయాన కంపెనీ పిజెఎస్‌సి ఈ నౌకను కిరాయికి నడిపిస్తోంది. ప్రమాదంపై ఇప్పటివరకూ ఈ కంపెనీ వర్గాలు ప్రకటన వెలువరించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News