Wednesday, January 22, 2025

బ్రిటన్ ప్రధాని ట్రస్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Liz Truss Resign as UK PM

కొంప ముంచిన ఆర్థిక విధానాలు 
మినీ బడ్జెట్‌పై స్వపక్షం నుంచే వెల్లువెత్తిన విమర్శలు
పదవి చేపట్టిన 45రోజుల్లోనే వైదొలిగిన ప్రధాని 
ఇచ్చిన హామీలు తీర్చలేకపోయానని ఆవేదన 
వారంలో కొత్త నేత ఎన్నిక రేసులో సునాక్, జాన్సన్

లండన్: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ గురువారం తమ పదవికి రాజీనామా చేశారు. కేవలం 45 రోజులు అధికారంలో ఉన్న బ్రి టన్ స్వల్పకాలిక ప్రధానిగా చరిత్రలో నిలిచారు. ఆమె ఆర్థిక విధానాలు, చేపట్టిన కా ర్యక్రమాలు బ్రిటన్ మార్కెట్‌లో పెను ప్రకంపనలకు దారితీశాయి. ఈ దశలో ట్రస్ తా ను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఆమె అధికారిక డౌనింగ్ స్ట్రీట్ నుంచి మీడియాతో మాట్లాడారు. రాజీనామా విషయాన్ని బ్రిటన్ రాజుకు తెలియచేసినట్లు తెలిపారు. అన్ని పరిణామాలను ఆయనతో మాట్లాడి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తాను ఏదైతే చేయడానికి ముందుకు వచ్చి ప్రజాతీర్పును పొందా నో దానిని ఇప్పటి పరిస్థితుల నడుమ అమ లు చేయలేకపోతున్నాను. అందుకే రాజీనా మా చేస్తున్నానని, ప్రధాని పదవికి వేరే వ్య క్తిని ఎంచుకునే వరకూ ఈ బాధ్యతలలో ఉంటానని లిజ్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారుదేశ ఆర్థి క మంత్రిపై ఈ వారం వేటేసిన ట్రస్ కేబినెట్ నుంచి గురువారమే దేశ హోం మం త్రి, సంతతి మూలాలున్న మహిళ సుయెల్లా బ్రేవర్మన్ రాజీనామా చేశారు. వ చ్చేవారం కీలక బడ్జెట్‌ను ట్రస్ కేబినెట్ ఎ దుర్కొవల్సి ఉంది. స్వపక్షం అయిన కన్సర్వేటివ్‌ల నుంచి ఆమెపై రాజీనామాకు ఒత్తి డి పెరుగుతూ వచ్చింది. రాజీనామాకు ముందు కన్సర్వేటివ్ ఎంపిలు అత్యధిక సంఖ్యలో ఆమె రాజీనామాకు పట్టుపడుతున్నట్లు తెలిపే లేఖను ట్రస్‌కు పార్టీ స్పెషల్ రూల్ కమిటీ 1922 చైర్మన్‌గా ఉన్న సర్ గ్రాహం బాడీ అందించారు. పదవికి రాజీనామా చేయాలని ఇది పార్టీ వెలువరించిన ఆదేశంగా నిర్ధారించారు. 47 సంవత్సరాల ట్రస్ కేవలం 44 రోజులు అధికారంలో ఉన్నారు. ఈ కాలం కూడా సంక్షుభితంగానే సాగింది. అధికారంలోకి వచ్చే దశలోనే క్వీన్ ఎలిజబెత్ మరణం, తరువాత ఎన్నికల ప్రచార దశలో తాను ప్రకటించిన పన్నుల కోత ప్యాకేజీకి రంగం సిద్ధం చేసుకోవడం వంటి పరిణామాలతో దేశంలో అపూర్వరీతిలో పౌండు విలువ పడిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగింది. సామాన్య మధ్యతరగతి ప్రజల బడ్జెట్ అంచనాలను తలకిందులు చేస్తూ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. హౌస్ ఆఫ్ కామన్స్‌లో విపక్షం నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. తిరిగి దేశంలో పార్లమెంట్ ఎన్నికలను ఆశించిన ప్రతిపక్ష లేబర్ పార్టీ లిజ్‌కు సభలో ఓ ఛాన్స్ ఇచ్చినట్లు ప్రకటించి, పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లేబర్ పార్టీ లబ్ధి పొందుతుందని ఖరారు చేసుకున్న అధికార కన్సర్వేటివ్‌లు వెంటనే లిజ్‌ను తప్పించి, ఏకాభిప్రాయ సాధనతోనే వేరే వ్యక్తికి ప్రధాని పట్టం కట్టాలని భావించారు. లిజ్ రాజీనామాకు పట్టుపట్టారు. దీనితో లిజ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఫైటర్‌ను క్విట్టర్‌ను కానన్నారు
మంత్రుల రాజీనామాలు, ఆర్థిక వ్యవస్థ చిక్కులు, స్వపక్షం విపక్షం నుంచి విమర్శల నడుమ ఆమె 24 గంటల క్రితం మాట్లాడుతూ.. తాను ఫైటర్‌ను క్విట్టర్‌ను కానని వ్యాఖ్యానించారు. సంక్షోభాలను అధిగమించి ముందుకు సాగుతానని తెలిపారు. తనను విమర్శిస్తూ వస్తున్న ఎంపిలను ఉద్ధేశించి ఎవరికీ భయపడేది లేదని, ముందుకు సాగుతానని, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
వారం రోజులలో తదుపరి నేత
లిజ్ రాజీనామాతో ఈ స్థానంలో కొత్త వ్యక్తిని కన్సర్వేటివ్‌లు వారం రోజులలో ఎన్నుకోవల్సి ఉంటుంది. ఎవరు అధికార పగ్గాలు చేపట్టినా టోరీ ప్రతిష్టకు పడ్డ గండిని పూడ్చటం కష్టమే అవుతుంది. 2025 జనవరిలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ట్రస్ పదవీకాలం పూర్తిగా నిరాశనే మిగిల్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. బ్రెగ్జిట్ అనంతర బ్రిటన్‌లో అత్యధిక స్థాయి రుణభారం, బలహీనమైన అభివృద్ధి, పన్నుల మోతలు, వ్యయంపై కోతలు వంటి పరిణామాలు తలెత్తాయి. పూర్తిగా చెల్లాచెదరైన అవస్థలో దేశం ఉంది. దారుణ స్థితి ఉందని ప్రముఖ టోరీ ఎంపి ఛార్లెస్ వాకర్ ఇటీవలే బిబిసికి ఓ ఇంటర్వూలో తెలిపారు. ఇప్పటికే పార్టీకి తాము చేసిన నష్టం పూడ్చలేనిది. అసాధారణ స్థాయిలో ఉందని వ్యాఖ్యానించారు.
తరువాతి ప్రధాని పదవికి పలువురు పేర్లు.. రిషి సునాక్‌కు ఎక్కువ ఛాన్స్
ఇప్పుడున్న అంచనాల మేరకు దేశానికి తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలున్న వ్యక్తులలో భారత సంతతికి చెందిన రిషిసునాక్ పేరు ప్రబలంగా విన్పిస్తోంది. ఆర్థిక మంత్రి జెరెమీ హంగ్ ల పేర్లు విన్పిస్తున్నాయి. సునాక్ తన వాస్తవిక ఆర్థిక విధానాలను ఎంపిల ముందు ఉంచారు. అయితే చివరి రౌండ్‌లో ట్రస్ వాదనను ఎంపీలు గెలిపించారు. ఇప్పుడు జరిగిన పరిణామాలతో సునాక్ వైపు చూస్తున్నారు. ప్రధాని పదవికి పోటీ పేర్లలో మాజీ హోం మంత్రి స్యూయెల్లా బ్రెవెర్మెన్, కెమి బడెనోచ్, టామ్ టుగెండహట్, పెన్నీ మెర్డానాట్ కూడా ఉన్నారు.

Liz Truss Resign as UK PM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News