Wednesday, January 22, 2025

ప్రధానిగా పని చేసింది 45 రోజులే.. అయినా ఏడాదికి రూ. కోటి భత్యం

- Advertisement -
- Advertisement -

Liz Truss To Get ₹ 1 Crore A Year Payout Despite 45-Day As UK PM

లిజ్‌కు సిజిసిఎపై పెల్లుబుకుతున్న వ్యతిరేకత

లండన్: సంపన్నులకు పన్ను రాయితీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడం, ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వంటి కారణాలతో బ్రిటన్ ప్రధాని లిజ్‌ట్రస్ రెండు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని పదవిలో ఉన్నది కేవలం 45 రోజులే అయినప్పటికీ ఆ తర్వాత జీవితాంతం ఏడాదికి సుమారు రూ.1.05 కోటి రూపాయలు (1,15,000 పౌండ్లు)ప్రభుత్వంనుంచి భత్యంగా పొందనున్నారు. బోరిస్ జాన్సన్ రాజీనామాతో బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్‌ట్రస్ ఏడు వారాలు కూడా ఆ పదవిలో ఉండలేకపోయారు. దీంతో ్రఅతి తక్కువ కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా యుకె చరిత్రలో నిలవనున్నారు. పని చేసింది తక్కువ సమయమే అయినప్పటికీ పబ్లిక్ డ్యూటీ కాస్ట్ అలవెన్స్( పిడిసిఎ) పొందేందుకు అర్హత పొందారు.దీంతో లిజ్‌ట్రస్ జీవితాంతం ఈ భత్యాన్ని అందుకోనున్నారు. మాజీ ప్రధానమంత్రులకు జీవితాంతం సహాయం అందించడం కోసం 1991లో పిడిసిఎను ప్రవేశపెట్టారు. ప్రధానిగా లేకపోయినా ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొనే ఉద్దేశంతో ఈ భత్యాన్ని ఇస్తారు.

మాజీ ప్రధానిగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యాలయ ఖర్చులు, సిబ్బంది వేతనాల కోసం మాత్రమే దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఖర్చు చేసిన బిల్లులకు మాత్రమేఈ భత్యం చెల్లిస్తారు. ప్రస్తుతం అయిదుగురు బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ భత్యం పొందేందుకు అర్హత సాధించగా, ఇప్పుడు లిజ్ ట్రస్ ఆ జాబితాలో చేరనున్నారు.అందులో మాజీ ప్రధానులు జాన్ మేజర్, టోనీ బ్లెయిర్‌లు అత్యధిక భత్యాన్ని పొందుతున్నట్లు సమాచారం. గోర్డాన్ బ్రౌన్(1,14,712 పౌండ్లు), డేవిడ్ కామెరోన్( 1,13,423 పౌండ్లు), థెరిసా మే(57,832 పౌండ్లు)లు ఈ భత్యాన్ని అందుకుంటున్నారు. అయితే ఇటీవల పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్ ఈ భత్యం అందుకుంటున్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఒక వేళ లిజ్ ట్రస్ ఈ పథకం కింద లభ్ధి పొందితే ఆరుగురు మాజీ ప్రధానులకు కలిపి ఏడాదికి 8 లక్షల పౌండ్లు( రూ.7.37 కోట్లు) ఖర్చవుతున్నట్లు అంచనా. అయితే వివాదాస్పద నిర్ణయాలతో పదవి వీడుతున్న లిజ్‌ట్రస్‌కు ఈ భత్యాన్ని ఇవ్వవద్దని.. లేదా ఆమే స్వయంగా వదులకోవాలనే వాదన అప్పుడే మొదలైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News