Sunday, November 3, 2024

చిరాగ్ పాశ్వాన్‌పై ఎంపీల తిరుగుబాటు

- Advertisement -
- Advertisement -

చిరాగ్ పాశ్వాన్‌పై ఎంపీల తిరుగుబాటు
లోక్‌సభలో నేతగా పారస్ ఎంపిక

న్యూఢిల్లీ: లోక్‌సభలో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి)కి చెందిన ఆరుగురు ఎంపీలలో ఐదుగురు తమ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌పై తిరుగుబాటు చేసి ఆయన స్థానంలో చిరాగ్ పశుపతి కుమార్ పారస్‌ను చిన్నాన్న(దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు) ఎన్నుకున్నారు. జెడి(యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న చిరాగ్ పాశ్వాన్‌తో పొసగకనే ఈ ఐదుగురు ఎంపీలు ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎల్‌జెపి నాయకునిగా ఎన్నికైన అనంతరం పశుపతి కుమార్ పారస్ సోమవారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ను మంచి నాయకునిగా, వికాస్ పురుష్‌గా అభివర్ణించడం విశేషం. పార్టీని తాను చీల్చినప్పటికీ దాన్ని కాపాడానని హాజీపూర్ నుంచి ఎంపీగా లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పారస్ విలేకరులకు తెలిపారు.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు వ్యతిరేకంగా ఎల్‌జెపి పోటీ చేసి పార్టీ ఓటమికి కారకుడైన చిరాగ్ పాశ్వాన్‌పై పార్టీ కార్యకర్తలలో 90 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎలో తమ గ్రూపు కొనసాగుతుందని, చిరాగ్ పాశ్వాన్ పార్టీలో ఉండవచ్చని ఆయన చెప్పారు. తమ నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు తెలియచేశామని ఐదుగురు ఎంపీలు తెలిపారు. కాగా, తాజా పరిణామాలపై పాశ్వాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

LJP MPs revolt against Chirag Paswan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News