Monday, December 23, 2024

గుజరాత్, హిమాచల్‌లో ఎల్‌జెపి(రాం విలాస్) పోటీ

- Advertisement -
- Advertisement -

LJP (Ram Vilas) contest in Gujarat, Himachal

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఎల్‌జెపి(రాం విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు జరగనున్న ఆ రెండు పెద్ద రాష్ట్రాలలో ఎన్ని స్థానాలలో పోటీ చేయాలన్న విషయమై ఇంకా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉందని చెప్పారు. బిజెపి పాలనలో ఉన్న ఆ రెండు రాష్ట్రాలలో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ఇటీవల జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్నామని, ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన తెలిపారు. లోక్ జన్‌శక్తి పార్టీ(రాం విలాస్) హిమాచల్ ప్రదేశ్ ఇన్‌చార్జ్‌ను ఒకటి రెండు రోజుల్లో నియమించి అభ్యర్థుల జాబితాపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News