Friday, December 20, 2024

బాలరాముని ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం…

- Advertisement -
- Advertisement -

అయోధ్య: రామమందిర ఉద్యమంలో బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి లాల్ కృష్ణ అద్వానీ, బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ప్రముఖ పాత్ర పోషించారు. అయోధ్యలో జరుగుతున్న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అద్వాణీ, జోషి హాజరుకావడంలేదని తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో పాటు వయసు రీత్య హాజరుకాలేమని వారు చెప్పినట్టు సమాచారం. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక కుమార్‌తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్‌ఎ అద్వానీ ఇంటికి వెళ్లి శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

లాల్ కృష్ణ అద్వానీ 1990లో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి లాల్ కృష్ణ ఆధ్వర్యంలో బిజెపి రథయాత్ర ప్రారంభించింది. మందిర్ వహీ బనాయేంగే నినాదంతో లాల్ కృష్ణ అద్వాణీ రామమందిర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News