Wednesday, January 22, 2025

అద్వానీ ఇంటికెళ్లి భారత రత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఇంటికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లి ‘భారత రత్న’పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తదితర నేతలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదుగురికి భారత రత్న అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో మాజీ ప్రధాని పివి. నరసింహా రావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రజ్ఞుడు  ఎమ్.ఎస్.స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ లకు మరణానంతరం భారత రత్న అవార్డులు దక్కాయి. మార్చి 30న రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘భారత రత్న’ అవార్డులను అందజేశారు.

పివి. నరసింహా రావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనుమడు జయంత్ సింగ్ అవార్డులను అందుకున్నారు. ఇక స్వామినాథన్, కర్పూరి ఠాకూర్ తరఫున వారి కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. అద్వానీ అనారోగ్య కారణాల వల్ల ఇవాళ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఆయన ఇంటికి వెళ్లి ‘భారత రత్న’ ప్రదానం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News