Friday, July 5, 2024

గుణపాఠాలు నేర్వని నేతలు దేనికి?

- Advertisement -
- Advertisement -

ఇందిర ప్రతిపక్షాలపై కక్ష కట్టలేదు. నాయకులను తిట్టలేదు. తటస్థ సామాజిక నిర్మాతలను అరెస్టు చేయలేదు. సమాజాన్ని మతపరంగా చీల్చలేదు. చివరికి ఎమర్జెన్సీని ఎత్తేసి ఎన్నికలు జరిపారు. మోడీ పాలన అప్రకటిత ఎమర్జెన్సీ అని అద్వానీ పత్రికలకు 2015లోనే చెప్పారు. నేటి మోడీయం నియంతృత్వమని ప్రజలకు తెలుసు. మతోన్మాదులే కాదు, చదువుకున్న వారు, పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాల యాల విద్యార్థులు, మైనారిటీ మతస్థులను, ప్రత్యేకించి ముస్లింలను అనుమానిస్తున్నారు. ద్వేషి స్తున్నారు. హిట్లర్ నాజీయిజం, ముసోలిని ఫాసిజం, ఫ్రాంకొ నియంతృత్వం సమాహా రంగా నేడు దేశాన్ని పాలిస్తున్నాయి.

ప్రజలు, ప్రత్యేకించి భారతీయులు చరిత్ర మరుపు వీరులు. అవినీతిపరులను పదేపదే ఎన్నుకుంటారు. నాయకులు పాత పాటనే ప్రతి చోటా, ప్రతి సందర్భంలో పాడుతుంటారు. ప్రజల దృష్టిని మరల్చి లాభపడుతుంటారు. చట్ట సభల సమయాన్నీ హరిస్తుంటారు. నది నీరు పారిపోతూ ఉంటుంది. పోయిన నీరు వెనక్కు రాదు. కత్తుల రాత్రి అని పిలవబడిన 30 జూన్ 1934 రాత్రి హిట్లర్ ప్రధానాధికారి అర్నస్ట్ రోహ్మ్ (Ernst Rohm)తో సహా 290 మంది సొంత పారా మిలిటరీ (ఎస్‌ఎ) ముఖ్యులను, స్వపక్ష అసమ్మతీయులను, ప్రతిపక్షీయులను, ఛాన్సలర్లను, సంకీర్ణ ప్రభుత్వ పక్షాల మిత్రులను, దీర్ఘకాల మద్దతుదారులను తన ప్రత్యేక సైన్యం, రహస్య పోలీసు దళాలతో చంపించారు.

30 లక్షల ఎస్‌ఎ బలగాలను తప్పించారు. రోహ్మ్ హిట్లర్‌కు మంచి మిత్రుడు. నాజీ పార్టీ ప్రముఖుడు. ఇద్దరూ కలిసి హిట్లర్‌ను శక్తివంతున్ని చేసిన ఎస్‌ఎను స్థాపించారు. హత్యకు గురైనవారంతా హిట్లర్ అధికార సంపాదనకు, నరమేధాల్లో సహకరించినవారే. రోహ్మ్ బలపడ్డాడని, నాజీలలో ప్రగతిశీల భావాలను పెంచుతున్నాడని, వీరంతా తన అధికారానికి ముప్పని హిట్లర్ నమ్మాడు. అధికార స్థిరీకరణకు పార్టీలోను, వామపక్షీయులను నిరోధించి, సైన్యంపై పూర్తి పట్టుసాధించాలని భావించాడు. నాజీ అతిక్రమణల విమర్శకులను చంపించాడు. వీటిని గోధ్రా నరమేధంలో సొంత ప్రజల హత్యతో, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఇతర సంఘ్ నాయకుల తొలగింపుతో పోల్చవచ్చు.

కత్తుల రాత్రి హత్యల్లో నాజీలు ఇచ్చిన నినాదం ‘అన్నీ జర్మనీకే’. ఇది నేడు నిషేధం. జోర్న్ హోక్ చరిత్ర ఉపాధ్యాయుడు, మతవాద పార్టీ ‘జర్మనీకి ప్రత్యామ్నాయం (ఎఎఫ్‌డి)’ నాయకుడు. అబద్ధాలతో, జర్మనీ బహుళ సంస్కృతుల వ్యతిరేకతతో ఎదిగారు. జోర్న్ 2021 ఊరేగింపులో అన్నీ జర్మనీకే అని, అన్నీ.. అని తానంటే జర్మనీకే అని జనాలతో నిషేధిత నాజీ నినాదాన్ని పదేపదే పలికించారు. జాతి ద్వేషాన్ని పెంచినందుకు, యూదు వ్యతిరేక భాషను వాడినందుకు విమర్శకు గురయ్యారు. దానిపై అతని మీద కేసు నడుస్తోంది. ప్రాంతీయ ఎన్నికల్లో జోర్న్ తురింజియా గవర్నర్‌గా పోటీ చేయాలనుకుంటున్నాడు. గతేడాది చివర ప్రచారంలో అతను ఈ నినాదాన్ని మరలా ఇచ్చారు. నాజీ నరమేధ స్మారకం అవమాన చిహ్నమన్నాడు. (గాంధీ, నెహ్రూలను తూష్కరించి, గాంధీని చంపిన గాడ్సేను ఆరాధించి, గాడ్సేగుళ్ళు కట్టినట్లు) జోర్న్‌ను ఉపేక్షించరాదని జర్మనీ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు సిగ్మర్ గాబ్రియల్ అన్నారు.

జోర్న్ చర్యలు ఎఎఫ్‌డి రూపాన్ని తెలుపుతున్నాయని యూదుల కేంద్ర మండలి విమర్శించింది. ఆయన ప్రవర్తనతో పార్టీ ప్రజామోదానికి ముప్పని హెచ్చరించి ఎఎఫ్‌డి 52 ఏళ్ల జోర్న్‌ను, యువనేతని కూడా చూడకుండా బహిష్కరించింది. యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఎఎఫ్‌డి ఎక్కువ శాతం ఓట్లు సాధించిన తర్వాత జోర్న్ తురింజియా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గెలిచి రాజ్యాంగ స్థానాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు.
ముస్లింల 400 ఏళ్ల బానిసత్వ పాలన నుండి నేను భారత్ (హిందువుల)ను విముక్తి చేశానని మోడీ అసందర్భంగా, అనవసరంగా అంటారు. అదే నిజమైతే హిందువులు భారత్‌లో అధిక సంఖ్యాకులుగా ఉండేవారేకారు. మోడీ ప్రధాని అయ్యేవారుకారు. ఈ యేటి ఎన్నికల్లో మెజారిటీ హిందువుల ఓట్ల కోసం మైనారిటీ ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొట్టారు. తన నిరంకుశ పాలనను కప్పిపుచ్చడానికి సందు దొరికితే ఇందిరా గాంధీ రుద్దిన ఎమర్జెన్సీని ఎత్తేస్తారు. లోక్‌సభ అధ్యక్షుడు ఓం బిర్లా ఎమర్జెన్సీ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టారు.

పార్లమెంటు ఉభయ సభల ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము ఎమర్జెన్సీని విమర్శించారు. ఇద్దరూ సంఘ్ స్వభావాన్ని ప్రదర్శించారు. సీట్ల సంఖ్య తగ్గినా మోడీయం మారదని నిరూపించారు. ఇందిర అప్రజాస్వామిక ఎమర్జెన్సీ ప్రతిపక్షాల, పత్రికల, ప్రజల స్వేచ్ఛలను హరించింది. తన అధికారానికి ముప్పనుకున్న వారినందరినీ జైళ్ళలోకుక్కారు.అయితే ఆ ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధం కాదు. అంతర్గత, బాహ్య ప్రమాదాలలో ఎమర్జెన్సీవిధించే అవకాశాన్నీ అధికరణ 352 ఇచ్చింది. సంపూర్ణ విప్లవం పేరుతో లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ (జెపి) 25 జూన్ 1975 పాట్నా బహిరంగ సభలో సైన్యం, పోలీసులు, సాయుధ బలగాలు, ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించనక్కర లేదని దేశాధిక్కార పిలుపిచ్చారు. ఇది రాజ్య ముప్పుగా పరిగణించబడింది. ఇందిర రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కళ్ళుగప్పి 25 జూన్ 1975 అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించారు.

ఒక తెల్లవారుజామున రాత్రికిరాత్రి మార్చిన తమ అనుకూల ప్రభుత్వ స్థాపనకు మోడీ సర్కారు రాష్ట్రపతి కోవింద్‌కు చెప్పకుండానే ఆయన ఫాసిమైల్‌ను వాడి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తేశారు. ఇందిర ప్రతిపక్షాలపై కక్ష కట్టలేదు. నాయకులను తిట్టలేదు. తటస్థ సామాజిక నిర్మాతలను అరెస్టు చేయలేదు. సమాజాన్ని మతపరంగా చీల్చలేదు. చివరికి ఎమర్జెన్సీని ఎత్తేసి ఎన్నికలు జరిపారు. మోడీ పాలన అప్రకటిత ఎమర్జెన్సీ అని అద్వానీ పత్రికలకు 2015 లోనే చెప్పారు. నేటి మోడీయం నియంతృత్వమని ప్రజలకు తెలుసు. మతోన్మాదులే కాదు, చదువుకున్నవారు, పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, మైనారిటీ మతస్థులను, ప్రత్యేకించి ముస్లింలను అనుమానిస్తున్నారు. ద్వేషిస్తున్నారు. హిట్లర్ నాజీయిజం, ముసోలిని ఫాసిజం, ఫ్రాంకొ నియంతృత్వం సమాహారంగా నేడు దేశాన్ని పాలిస్తున్నాయి.

ఎమర్జెన్సీతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌యస్‌యస్) విపరీతంగా లాభపడింది. ఆర్‌యస్‌యస్ ఆది నుండి మతవాదే. నేతాజీ స్వాతంత్య్ర పోరాటానికి, భారత జాతీయ సైన్య నియామకానికి, గాంధీ ఆధ్వర్యం లో నడిచిన జాతీయ ఉద్యమానికి హాని చేసింది. ఆంగ్లేయులకు సాయపడింది. వాళ్ళ పాలనే కొనసాగాలని తపించింది. అలాంటి సంఘ్‌ను కేవలం ఇందిర వ్యతిరేకతతో జెపి పొగిడారు. సంఘ్ మతవాదయితే నేనూ మతవాదినేనన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో సంఘీయులకు సోషలిస్టులు, కమ్యూనిస్టులతో తిరిగే అవకాశం దొరికింది. వారి రాజకీయ అంటరానితనంపోయింది. విపరీతంగా సాహిత్యం అమ్మారు. చందాలు వసూలు చేశారు. మమ్ములను జైళ్ళ నుండి వదలండి మీ 20 అంశాల, సంజయ్ 5 అంశాల పథకాల అమలుకు సాయపడతాము. సంఘ్ కార్యకర్తలు మీకు సేవ చేస్తారు. అన్న సంఘ్ నాయకుల ప్రార్థనలను ఇందిర వినలేదు. వారిని జైళ్ళ నుండి వదలలేదు. ఈ విషయాలు తెలియని ప్రజల దృష్టిలో వాళ్ళు హీరోలయ్యారు.

రాజకీయ భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భిన్నత్వాలు, తాత్విక విభేదాల రాజకీయులు, అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు శత్రువుల్లా కాక పోటీదారులుగా భావించి, చట్టసభల్లో ప్రజల కోసంపని చేయలేరా? మనుషులు మానవులుగా మారలేరా? నెహ్రూ వైదికవాదులైన రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణన్, పటేల్‌ల సహకారం పొంది సమన్వయంతో పాలించలేదా? పదేళ్ళ పాలనను, నేటి మూడవ ముచ్చటను చూస్తేకుదరదనిపిస్తోంది. అదానీ, అంబానీలకు దోపిడీ వల్లింపులతో, నూతన సంపాదన వనరులతో రోజూ దోచిపెట్టేవారు ఆ వల్లింపు వేదాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వాడలేరా? మతోన్మాదుల లక్షణం కుక్కతోక లాంటిది. మతవాదులు రోజూ ప్రవచనాలను చదువుతారు, వింటారు. కాని పాటించరు. వాగాడంబరత కాదు, నిర్మాణాత్మక చర్యలు ప్రగతికి సోపానాలు. సామాజిక ప్రయోజనాలు పొంది పైకొచ్చిన సమూహాలు ఈరోగాన్ని నిరోధించే ప్రయత్నాలు చేయాలి. చారిత్రక గుణపాఠాలు నేర్పి తప్పులు తిరిగి దొర్లకుండా చూడాలి. విలువలను కాపాడాలి. ప్రజలను సరైన దిశలో చైతన్య పరిస్తే వాళ్ళే వల్లింపు వీరుల భరతం పడతారు.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News