Thursday, January 23, 2025

ఎల్‌కె అద్వానీకి భారత రత్న..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తనకు ప్రకటించిన భారత రత్న అవార్డు వ్యక్తిగా తనకు లభించిన గౌరవమేగాక తన జీవితమంతా తన శక్తిమేరకు పాటించిన ఆదర్శాలకు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని బిజెపి కురువృద్ధ నాయకుడు లాల్ కృ్షష్ణ అద్వానీ అన్నారు. అత్యంత వినమ్రతతతో, కృతజ్ఞతతో తనకు ఈరోజు ప్రకటించిన భారత రత్నను స్వీకించడానికి సమ్మతిని తెలియచేస్తున్నానని శనివారం ఆయన ప్రకటించారు. దేశ అత్యున్నత నౌర పురస్కారం భారత రత్న అవార్డుకు బిజెపి భీష్మ పితామహుడు ఎల్ కె అద్వానీ పేరును ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రకటించిన తర్వాత స్పందిస్తూ అద్వానీ ఒక ప్రకటన విడుదల చేశారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గురించి అద్వానీ వివరిస్తూ తన 14వ ఏట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో కార్యకర్తగా చేరినప్పటి నుంచి తాను ఒకే ఒక్క ప్రతిఫలాన్ని ఆశించానని, తనకు అప్పగించే ఎటువంటి కర్తవ్యాన్నయినా, బాధ్యతనయినా తాను అమితంగా ప్రేమించే ఈ దేశం కోసం నిస్వార్థంగా సేవలందచేయడానికి తన ఈ ఈజీవితం అంకితమవ్వాలన్నదే తన ఆశయమని అద్వానీ తెలిపారు.

ఈ జీవితం నాది కాదు..నా జీవితం ఈ దేశం కోసం అన్నదే తన జీవితాశయంగా చేసుకున్నానని ఆయన పేర్కొన్నారు. గతంలో భారత రత్న పురస్కార గ్రహీతలైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలతో సన్నిహితంగా పనిచేసే గౌరవం తనకు దక్కిందని, ఈ సందర్భంగా ఆ ఇద్దరు వ్యక్తులను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంటున్నానని ఆయన తెలిపారు. ప్రజా జీవితంలో తాను కలసి పనిచేసిన లక్షలాది మంది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, ఇతరులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. తన కుటుంబ సభ్యులందరికీ, ప్రత్యేకంగా తన దివంగత సతీమణి కమలకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. తన జీవితంలో వారంతా తనకు కొండంత అండగా నిలబడ్డారని అద్వానీ పేర్కొన్నారు. ఎంతో ఘనమైన మన దేశం అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News