Sunday, December 22, 2024

22న అయోధ్యకు అద్వానీ: విహెచ్‌పి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కురువృద్ధ నాయకుడు, అయోధ్య రామాలయ ఉద్యమ సారథి ఎల్‌కె అద్వానీ జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొంటారని విశ్వ హిందూ పరిషద్ అధ్యోఉడు అలోక కుమార్ గురువారం వెల్లడించారు. అయితే పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై ఇంకా స్పష్టత రాలేదు.

అయోధ్యకు తాను వస్తానని అద్వానీ తెలిపారని, అవసరమైతే ఆయన కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తామని కుమార్ తెలిపారు. తాను కూడా రావడానికి ప్రయత్నిస్తానని మురళీ మనోహర్ జోసి తెలిపారని ఆయన వివరించారు. 96 సంవత్సరాల అద్వానీ బిజెపి వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1990 దశకం ప్రారంభంలో జరిగిన రామాలయ ఉద్యమంలో అద్వానీ, జోషి కీలక పాత్ర పోషించారు. మురళీ మనోహర్ జోషి కూడా బిజెపి వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News