Thursday, January 23, 2025

మైక్రోఫైనాన్స్ మార్గంలో రుణయాప్‌లు

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగ, టార్గెట్

Young Man arrest in online call money case in hyd
మనతెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగ, నిరుపేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని రుణాలు ఇ చ్చే మైక్రోఫైనాన్స్ మాదిరిగానే ఆన్‌లైన్‌లో కొన్ని యా ప్‌లు రుణాలు ఇస్తూ అధికవడ్డీల వ్యాపారానికి తెర తీస్తున్నాయి. గతంలో రుణయాప్‌ల బాధితుల ఫిర్యా దు మేరకు పోలీసులు దాడులు నిర్వహించినప్పటికీ కొత్త యాప్‌ల ద్వారా రుణాల దాందా ప్రారంభించాచి. ఈ క్రమంలో గతంలో సుప్రీంకోర్టు నిషేధించిన మైక్రో ఫైనాన్స్ బాటలోనే ఈ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండానే గూగుల్ ప్లేస్టోర్ లో, యాప్ స్టోర్‌లో ఈ యాప్‌లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా మనీ బా క్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్, మనీ ట్యాప్, పే సెన్స్,ధని,మనీలెండ్స్,క్రెడిట్ బీ, క్యాష్ ఈ, మనీవ్యూ, ఎర్లీసేలరీ, స్మార్ట్ కాయిన్, లేజీపే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకెట్, ఫ్లెక్స్ సేలరీ, రూపీ ఇలా చెప్పు కుంటూ పోతే వందల లోన్ యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తూ సామాన్యులను, విద్యార్థినీ విద్యార్థులను ఆ కర్షిస్తున్నారు.

తాజాగా ఆన్‌లైన్ వేదికగా కొత్త రకం రుణ వ్యాపారంలో విద్యార్థులు, నిరుద్యోగులకు టా ర్గెట్ చేసే క్రమంలో జస్ట్ ఆధార్ కార్డ్..పాన్ కార్డ్ ఉంటే చాలు డబ్బులు ఆన్ లైన్‌లో రుణాలు ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు అప్పులు ఏలాంటి ష్యూరిటీలు లేకుండా ఇచ్చే స్తున్నారు. అయితే రుణం ఇచ్చే ముందు సమీప బం ధువులు, మిత్రులు పదిమంది షూరిటీ అడుగుతారు. అది కూడా కేవలం వారి కాంటాక్ట్ ఫోన్ నంబర్లు ష్యూరిటీగా పంపితే చాలని రుణయాప్ నిర్వహకులు పేర్కొంటున్నారు. ఈ యాప్‌ల ద్వారా రుణం తీసుకుని తిరిగి చెల్లించని పక్షంలో సదరు రుణం తీసుకున్న వ్యక్తి ఇచ్చిన 10 నంబర్లకు మెసేజ్‌లు పంపుతారు. ష్యూరిటీగా ఎవరి ఫోన్ నంబర్లు తీసుకున్నారో వా రందరికీ వాట్సాప్‌లో మీరు ఫలానా వారికి షూరిటీ ఉన్నారు.

ఆ డబ్బులు వెంటనే కట్టకపోతే మా మను షులు మీ ఇంటికి వస్తారు.. మీమీద కేసు పెడుతున్నా మని, కేసు పెడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షపడు తుందో అన్ని వివరాలతో వాట్సాప్ కు మెసేజ్ పంపు తారు. అంతేకాకుండా లోన్ ఎవరు తీసుకున్నారో వారి పేరు ఫోన్ నంబర్, అడ్రస్ తో సహా అన్ని వివరాలు పంపుతారు. నిజానికి ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి కి లోన్ తీసుకున్న వ్యక్తికి అసలు సంబంధం కూడా ఉండకపోవచ్చు. అయినా మెసేజ్‌లు పంపుతూ వేధిస్తా రు. తెలుగు రాష్ట్రాల్లో మనీ బాక్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్, మనీ ట్యాప్, పే సెన్స్, ధని, మనీలెండ్స్,క్రెడిట్ బీ, క్యాష్ ఈ, మనీవ్యూ, ఎర్లీసేల రీ, స్మార్ట్ కాయిన్, లేజీపే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకె ట్, ఫ్లెక్స్ సేలరీ, రూపీ యాప్‌లపై పోలీసులకు వేలాది ఫిర్యాదు వచ్చాయి. అవసరానికి తీసుకున్న రుణానికి వడ్డీలు చెల్లించలేక బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యా దు చేస్తున్నారు.

పోలీసులు మాత్రం చెల్లించకుంటే మీపై కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తామని చెప్పే మాటలు న మ్మవద్దని బాధితులకు సూచిస్తున్నారు. మనీ బాక్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్, మనీ ట్యా ప్, పే సెన్స్, బీ, క్యాష్ ఈ, మనీవ్యూ, ఎర్లీసేలరీ, స్మార్ట్ కాయిన్, లేజీపే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకెట్, ఫ్లెక్స్ సేలరీ, రూపీల నుంచి ఎలాంటి మేసేజ్ వచ్చిన ఎవరు భయపడాల్సిన పని లే దని పోలీసు అధికారులు ధైర్యం చెబుతున్నారు. ఎవరై నా యాప్‌ల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాలని వేధించినా, ఒత్తిడి చేసినా వెంటనే సమీపంలో స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని బాధితులకు అభయమిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News