- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల జాతీయ సంస్థ (ఎన్‌ఐ- ఎంఎస్‌ఎంఈ) అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉస్మానియా టిబిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా సహకారంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియమ్ ఎంటర్‌ప్రైజేస్ 2021 జూలై 6వ తేదీన కొత్తగా స్టార్టఫ్‌లు ప్రారంభించే విధానం, స్టార్టఫ్‌ల నమోదు ప్రక్రియ, బ్యాంక్‌కు సమర్పించే ప్రాజెక్టు రిపోర్టు తయారీ, స్టార్టఫ్‌ల కోసం నిధుల సేకరణ వంటి అనేక విషయాలపై అవగాహన కలిగిస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సహకారంతో ఎంఎస్‌ఎంఈ 2021 జూలై 8వ తేదీన యూసుఫ్‌గూడలోని ఎన్‌ఐ -ఎంఎస్‌ఎంఈ (NI-msme, నిమ్స్ మే) క్యాంపస్‌లో లోన్ మేళాను నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.
- Advertisement -